
ఇందులో మిల్కీబాయ్ మహేశ్ బాబు ఊరమాస్ గెటప్ లో కనిపిస్తారట. నోట్లో బీడీ పెట్టుకొని కాలుస్తున్న స్టిల్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. ఇన్నాళ్లు చూడని మహేశ్ బాబును ఈ సినిమాలో త్రివిక్రమ్ చూపెడుతున్నాడంటూ ఫ్యాన్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ మూవీ నుంచి తమన్ ను తొలగించారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాస్ట్ అండ్ క్రూ వేసినప్పుడు సంగీత దర్శకుడు తమన్ పేరు మిస్ అయ్యింది. దీంతో ప్రముఖ సినీ వెబ్ సైట్లు తమన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు కథనాలు ప్రచురించాయి. సినిమాకు సంబంధించిన పోస్టర్ కరెక్టర్ టైంలోనే రిలీజ్ అయ్యిందని చెప్తున్నారు. కానీ ఇందులో తమన్ పేరు లేకపోవడంపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఆయన అభిమానుల అనుమానం పెరిగింది.
తమన్ ఈ మధ్య ప్రతీ హీరో సినిమాను విష్ చేస్తున్నాడు. చాలా రోజుల నుంచి ఆయన ఇలా చేస్తున్నాడు. ఈ సినిమా పోస్టర్ ను కూడా అలాగే విష్ చేశాడు తమన్. దీన్ని బట్టి కొందరు లేదు తమన్ సినిమాకు పని చేశాడని కొందరు అంటున్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. తమన్ ఈ మూవీలో భాగస్వామి అయ్యాడా..? లేక తప్పుకున్నాడా..? మేకర్స్ కూడా దీని గురించి ఎటువంటి కామెంట్లు చేయడం లేదు. దీంతో తమన్ ఈ మూవీ నుంచి తప్పుకున్నాడన్న వార్తలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.