థార్ రాక్స్ ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
థార్ రాక్స్ బేస్ వేరియంట్ MX1. ఈ ట్రిమ్ అద్భుతమైన ఫీచర్స్ ను కలిగి ఉంది. దీని అన్ని ఫీచర్ల వివరాలను తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి ఉండాలి. థార్ రాక్స్‌లో స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది, ఇది గరిష్టంగా 162హెచ్పీ శక్తిని, 330ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మరొక డీజిల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది 2.2-లీటర్ డీజిల్ ఇంజన్, ఇది గరిష్టంగా 152హెచ్పీ శక్తిని, 330ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి.
థార్ రాక్స్ సేఫ్టీ ఫీచర్ల వివరాలను కంపెనీ వెల్లడించలేదు. ఇది కెమెరా ఆధారిత లెవల్-2ఏడీఏఎస్ సూట్‌తో అందించబడింది. నాలుగు చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ప్రయాణీకులందరికీ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు, టీసీఎస్, టీపీఎంఎస్ , ఈఎస్ పీ ఎస్ యూవీ కొన్ని సేఫ్టీ ఫీచర్స్. ఆఫ్-రోడింగ్‌ను సులభతరం చేయడానికి, మహీంద్రా క్రాల్ స్మార్ట్ అసిస్ట్ (CSA) , ఇంటెల్లి టర్న్ అసిస్ట్ (ITA) అలాగే ఎలక్ట్రానిక్ లాకింగ్ రియర్ డిఫరెన్షియల్‌ను కూడా అందిస్తోంది. మొత్తంమీద, ఈ ఫీచర్లన్నీ దీనిని చాలా అధునాతన ఎస్ యూవీగా మార్చేస్తాయి.