
Priyanka bold comments : బాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన హీరోయిన్ లలో ప్రియాంక చోప్రా ఒకరు.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ప్రియాంక ఆ తర్వాత హాలీవుడ్ కు వెళ్ళిపోయింది.. గత కొన్ని రోజులుగా అక్కడే ఈమె బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతుంది.. ప్రస్తుతం ఈమె అక్కడ వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది..
అయితే కెరీర్ లో తొలిరోజుల్లో తనకు ఎదురైనా అనుభవాలను ఆమె పంచుకుంది.. ఇప్పటికే చాలా సార్లు ఓపెన్ గా మాట్లాడిన ఈమె తాజాగా మరోసారి తనకు జరిగిన చేదు అనుభవాలను గురించి చెప్పుకొచ్చింది. ఈమె తాజాగా ఒక బాలీవుడ్ డైరెక్టర్ గురించి చేసిన కామెంట్స్ అందరికి షాక్ ఇస్తున్నాయి..
ఈ మధ్య తన సినిమాల రిలీజ్ సమయంలో వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటుంది.. తాజాగా ఈమె ఒక డైరెక్టర్ గురించి స్పందిస్తూ.. ”నేను బాలీవుడ్ లో అడుగు పెట్టిన కొత్తలో ఒక సినిమాను ఒప్పుకున్నాను. ఆ సినిమా స్టార్ట్ అయ్యాక కొన్ని రోజులకు డ్యాన్స్ చేయాల్సి వచ్చింది..
అదే సమయంలో ఆ సినిమా డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి డ్యాన్స్ చేసేప్పుడు నీ లో దుస్తులన్నీ తీసేయాలి అండర్ వేర్ చూపించమని అడిగితే నాకు చాలా కోపం వచ్చింది.. ఏం చేయాలో అర్ధంకాక చివరికి ఆయన చెప్పిన దానికి ఒప్పుకోలేదు.. ఆ తర్వాత మరుసటి రోజు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నా.. అలాంటి వ్యక్తి సినిమాలో నాకు నటించడం ఇష్టం లేదు” అంటూ ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..