Hero big plan : ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు పైకెదుగుతారో, ఏ సమయంలో ఎవరు ఢమాల్ న కింద పడతారో ఎవరూ చెప్పలేరు. ఒకప్పుడు కమెడియన్ల నుంచి విలన్లుగా, అగ్ర హీరోలుగా తమ దశ తిరిగినన్నీ రోజులు సినిమాల్లో రాణించి స్టార్ డమ్ అనుభవించారు. అదే సమయంలో కొందరు తమ అనుకున్న వారందరినీ నమ్మి మోసపోయారు. చివరి రోజుల్లో చేతిలో చిల్లిగవ్వలేక రోడ్డున పడ్డారు. చేయి చాచి అడుక్కోలేక తమకేదైనా వేషమిచ్చి ఆకలి తీర్చమని ప్రాధేయపడిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ఇప్పటి తరంలో డెయిలీ పేమెంట్ ఆర్టిస్టు నుంచి స్టార్ హీరోల వరకు దీపం ఉన్నప్పుడు చక్కబెట్టుకోవాలనే చందంగా వివిధ వ్యాపారాల్లో పెట్టుబడుల పెడుతున్నారు. అర్ధంతరంగా తమ సినిమా కెరీర్ ముగిసినా వ్యాపారాలు తమను ఆర్థికంగా ఆదుకుంటాయని ముందు చూపుతో భవిష్యత్ కు ఆర్థిక బాటలు వేసుకుంటున్నారు. ప్రధానంగా హోటళ్లు, రియల్ ఎస్టేట్ రంగాలను ఎంచుకుంటున్నారు.
అయితే ఓ స్టార్ హీరో మాత్రం అప్పులు చేసి మరీ తనకు నచ్చిన వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
సదరు హీరో కొత్తలో ఆర్థిక క్రమశిక్షణ లేక ఉన్నదంతా పోగోట్టుకున్నాడట. ఒక్కసారి భవిష్యత్ అగమ్య గోచరంగా కనిపించడంతో ఇప్పుడిప్పుడే జాగ్రత్త పడుతున్నాడట. తనకు ప్రస్తుతం వస్తున్న సినిమాలకు సంబంధించిన రెమ్యూనరేషన్ సింహభాగం రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెడుతున్నాడట. ఇలా పోగేసిన దాంట్లో ముంబైలో ఓ లగ్జరీ భవంతిని కొనుగోలు చేశాడట. అలాగే విదేశాల్లోనూ ఓ అందమైన భవంతిని సైతం కొన్నాడట. ఇటీవల హైదరాబాద్ శివార్లలో ఓ ఫామ్ హౌస్ నిర్మాణం కూడా మొదలుపెట్టాడ. ఈ ఫామ్ హౌస్ కోసం దాదాపుగా రూ.200 కోట్లకు పైగా వెచ్చించాడట. అయితే ఈ డబ్బుల అంతా తాను సంపాదించింది కాదట.
ఇటీవల విశాఖపట్నానికి చెందిన ఓ పెద్ద బిజినెస్ మాగ్నెట్ నుంచి రూ.150 కోట్లు అప్పు తీసుకున్నాడట. ఆ డబ్బులతో భూములు కొనుగోలు చేశాడట. తన తదుపరి సినిమాల నుంచి వచ్చే రెమ్యూనరేషన్ నుంచి అప్పులు తీరుస్తానని సదరు బిజినెస్ మెన్ కు ముందే చెప్పాడట. నిజానికి ఇది మంచి ఎత్తుగడ అని కొందరు నటులు పేర్కొంటున్నారు. భూముల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవని, డబ్బులు ఉన్నప్పుడు కొనిపెట్టుకుంటే భవిష్యత్ లో మంచి రేటుకు అమ్ముకోవచ్చని అంటున్నారు.