23.3 C
India
Thursday, January 15, 2026
More

    Nagarjuna : ‘నేనున్నానని సినిమా అందుకే హిట్ అయ్యిందట.. అసలు విషయం చెప్పిన నాగార్జున

    Date:

    Nagarjuna
    Nagarjuna – Sirivennela Sitaramasastri
    Nagarjuna : సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికీ ఎంతో గౌరవం, అభిమానం. ఆయన రచనలు, రాసిన పాటలు అజరామరం. సిరివెన్నెల సీతారామశాస్త్రి అంటే హిరో నాగార్జున కు కూడా చాలా ఇష్టమట. ఆయన నేనున్నాను సినిమాలో రాసిన ఈ శ్వాసలో చేరితే అనే పాటతోనే సినిమా హిట్ అయిందని చెప్పొచ్చు.
    సిరివెన్నెల గురించి నాగార్జున ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  సిరివెన్నెల రాసిన పాటలో ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా.. అంటూ రాసిన పాట అద్భుతం. ముఖ్యంగా  ఈ పాట ఎంతో ఇన్స్ఫిరేషన్ . ఎవరైనా తండ్రి తన కొడుకుకు ఏం చెప్పాలనుకుంటాడో ఆ పాటలో మొత్తం చెప్పేశాడు. సీతారాముల కల్యాణం సినిమాకు సంబంధించి నిర్మాత వ్యవహరించినపుడు సిరివెన్నెల తో ఎక్కువ సమయం గడిపే అవకాశం వచ్చిందని నాగార్జున అన్నారు. ఆ సమయంలో ఎక్కువ సేపు ఆయనతో మాట్లాడే సమయం వచ్చిందన్నారు. దీంతో చాలా విషయాలు నేర్చుకున్నామన్నారు.
    నాగార్జున సినిమాల్లో సిరివెన్నెల రాసిన పాటలు ఎక్కువగా ఉంటాయని అంటుంటారు. అది నిజమే ఎందుకంటే అది కావాలని చేసిందేమీ కాదు.. కానీ ఆయన రాస్తే బాగుండని అనుకుంటున్నాను. అది అలా కలిసి వచ్చిందని నాగార్జున చెప్పారు. శ్రీ సీతారాముల కల్యాణం సినిమాలో సిరివెన్నెల ఒక్క పాటలోనే రామాయణం మొత్తం రాశారు. ఇలా రాయడం ఆయన వల్లే సాధ్యమవుతుంది. కొన్ని సినిమాల్లో ఆయన రాసిన పాటలు నాకు అర్థం కాకపోతే ఇది మార్చితే బాగుండని, లేకపోతే ఇది ఏంటో వివరంగా చెప్పాలని అడిగేవాడినని అన్నారు.
    సిరివెన్నెల అద్భుతమైన మనిషి. ఆయన పాటలు విన్నాక ఇలాంటి ఆలోచన శక్తి మనకెందుకు లేదని అనిపిస్తుంది. మనం ఎందుకు ఇలా ఆలోచించలేకపోతున్నామని అప్పుడప్పుడూ అనిపించినా.. ఆ ఆలోచన శక్తి, తెలుగు పై పటుత్వం, అలతి పదాలతో అద్వితీయమైన వార్తల్ని రాయడం  ఆయనకే సాధ్యం. ఆయన తెలుగు వారి నేస్తం అని చెప్పడంలో ఎలాంటి  సందేహం లేదు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Nagarjuna : అందాల భామల కోసం కలిసిన అక్కినేని నాగార్జున, సీఎం రేవంత్

    Nagarjuna : గతంలో N కన్వెన్షన్ కూల్చివేత, మంత్రి కొండా సురేఖ అక్కినేని...

    Nagarjuna : బీజేపీ లోకి నాగార్జున..? కుటుంబంతో కలిసి మోడీ దగ్గరకు..

    Nagarjuna : టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇటీవల తన కుటుంబంతో...

    Nagachithanaya: కాబోయే భార్యతో ఫొటో పెట్టి.. ఇదేం పని చైతూ?

    Nagachithanaya: అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల ఇటీవల...

    Nagarjuna : నాగార్జున, అమల పెళ్లి వెనుక ఇంత నడిచిందా..?

    Nagarjuna : టాలీవుడ్‌ మోస్ట్ బ్యూటిఫుల్‌ కపుల్స్ అనగానే ఠక్కున గుర్తొచ్చేది...