
Bigg Boss Shakila : సెక్సీ క్వీన్ గా గుర్తింపు దక్కించుకున్న షకీల గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆమె తీసిన డబుల్ ఎక్స్ సినిమాలను తట్టుకోలేక భారీ నిర్మతలు, దర్శకులు, హీరోలు సైతం తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకున్నారంటే అతిశయోక్తి కాదు. చాలా కాలం ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన ఈ సుందరి మరుగునపడిపోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ షో లో రెండు వారాలే ఉన్న ఆమె ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత మీడియా కొన్ని మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. రీసెంట్ గా ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు.
‘ఒకప్పుడు ఇండస్ట్రీలో వెలుగు వెలిగిన నేను ఒక్కో రోజు షూటింగ్ కు రూ. లక్ష వరకు రెమ్యునరేషన్ తీసుకున్నాను. దుబాయ్ లో చేసిన ఒక షోకు రూ. 20 లక్షల వరకు ఇచ్చారు. కానీ ఇప్పుడు అవకాశాలు చాలా తగ్గాయి. దీంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. రెమ్యునరేషన్ విషయం పక్కనుంచితే మంచి పాత్రలు ఇస్తే ఇప్పుడు కొనసాగుతాను.’ అని చెప్పారు.
‘ప్రస్తుతం టీవీల్లో కొన్ని ఫుడ్ మేకింగ్ షోలు చేస్తు్న్నాను. ఒక పాపులర్ చెఫ్ షోలో రన్నరప్ గా కూడా నిలిచాను. కొన్ని సీరియల్స్ లో అవకాశం వచ్చింది నటిస్తున్నాను. మంచి గుర్తింపు తెచ్చే పాత్రలే వచ్చాయి. సినిమాల్లో కూడా మంచి పాత్రల కోసం అన్వేషిస్తున్నాను. ఊపిరి ఉన్నంత వరకు కళారంగానికి సేవలు చేస్తూనే ఉంటాను.’ షకీల అన్నారు.
‘నా అనుకున్న వాళ్లే నన్ను మోసం చేశారు. సంపాదన బాగా ఉన్న సమయంలో మా అక్కయ్య నాతోనే ఉన్నారు. నా డబ్బును ఆమె సంరక్షిస్తున్నట్లు అనుకున్నా.. కానీ ఆమె నా డబ్బంతా తీసుకొని వెళ్లింది. అప్పటి నుంచి ఆర్థిక పరిస్థితులు మరింత అఘాదంలోకి నెట్టాయి. నా ఫ్యామిలీ నన్ను ఒంటరిని చేసి వెళ్లిపోయింది. అప్పుడప్పుడు నా బ్రదర్ నాతో మాట్లాడుతాడు. నా అన్న కూతురు (మేన కోడలు) నాతో ఉంటుంది. ఆయన చనిపోవడంతో కోడలును చూసుకునే బాధ్యత నాపై పడింది.’అని చెప్పారు.
‘ ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో కమెడియన్ వేణుమాధవ్ ఆదుకున్నాడు. ఒక వివాదం కారణంగా హైదరాబాద్ కు వచ్చానని తెలుసుకున్న ఆయన నా కోసం ఫిలింనగర్ కు వచ్చి మండిపడ్డారు. తన ఇంటికి ఎందుకు రాలేదని కొప్పడ్డాడు. అక్కడి నుంచి తీసుకెళ్లి రెండు రోజులు ఒక చెల్లిలా చూసుకున్నాడు. బట్టలు కూడా పెట్టి చెన్నైకి ఫ్లైట్ లో పంపాడు. ఇప్పటికీ ఆయన ఫ్యామిలీతో నాకు అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఇక నా బాయ్ ఫ్రెండ్ కూడా చీట్ చేశాడు. సినిమాల్లో నటిస్తూ కష్టపడి సంపాదించిన డబ్బులు చాలా మందికి ఇచ్చి మోసపోయాను.’ అని ఆమె చెప్పింది.