Vijay Varma Tamannaah : టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మిల్క్ బ్యూటీగా గుర్తింపు సంపాదించుకుంది తమన్నా. కెరీర్ ప్రారంభంలోనే ఒకటి, రెండు సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ బ్యూటీ. పెళ్లి ఎప్పుడు? అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్, దగ్గరి బంధువులు కూడా అడుగుతుండడంతో తను ఒక లవర్ ను ఎంచుకుంది తనే విజయ్ వర్మ.
తెలంగాణకు చెందిన మార్వాడి కుటుంబంలో జన్మించాడు విజయ్ వర్మ. తన విద్యాభాసం కూడా హైదరాబాద్ లోనే సాగింది. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటనలో శిక్షణ తీసుకున్నాడు. అనిరుద్ధరాయ్ దర్శకత్వం వహించిన పింక్ (2016)తో తెరంగేట్రం చేశాడు. ఆ తర్వాత తెలుగులో నానితో కలిసి MCA సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు. బాఘీ 3, డార్లింగ్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ లో కూడా నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం దాహాద్ సినిమాలో నటిస్తున్నాడు. 2008లోనే షార్ట్ ఫిల్మ్ లు తీసుకుంటూ కెరీర్ ప్రారంభించాడు విజయ్ వర్మ.
విజయ్ వర్మ, తమన్నా జంటగా చేసిన సినిమా ‘లస్ట్ స్టోరీస్ 2’. ఈ సినిమాలో ఈ జంటపై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించాడు దర్శకుడు. మూవీలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినిమాలోనే కాకుండా బయటకూడా వీరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా తమన్నా విజయ్ వర్మ గురించి చెప్పిన మాటలతో అవి కాస్తా నిజమయ్యాయి. ఆయన గురించి తమన్నా ఏమన్నదంటే. ‘విజయ్ నా అభిప్రాయాలను గౌరవిస్తారు. ఇంట్లో ఆడవారితో పాటు బయటి వారితోనూ చాలా గౌరవంగా నడుచుకుంటారు. అందుకే ఆయన నా మనస్సుకు దగ్గరయ్యాడు. విజయ్ నా జీవితంలోకి వచ్చినందుకు సంతోషంగా ఉంది.’ అని చెప్పింది తమన్నా.
ఈ మాటలతో ఇక వీరి వివాహం కన్ఫం అంటూ సోషల్ మీడియాలో వర్తాలు వినిపిస్తున్నాయి. ఈ జంటకు అప్పుడే విషెస్ చెప్తున్నారు అభిమానులు. కానీ లస్ట్ స్టోరీస్ లో తమన్నా ఎక్స్ ప్రెషన్స్ వ్యూవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి.
ReplyForward
|