Actor Sindhu : నటులంటే సాధారణంగా గుర్తుకు వచ్చేది లగ్జరీ లైఫ్. కార్లు, బంగ్లాలు, బ్యాంక్ బ్యాలెన్స్ అనుకుంటారు. వారి లైఫ్ స్టయిల్ కూడా అలాగే ఉంటుంది. ఇండస్ట్రీలో అలాగ కనిపిస్తేనే అవకాశాలు వస్తాయి మరి. ఇక ఒక దశకు వచ్చిన తర్వాత డబ్బు లేకుండా ఇండస్ట్రీ పట్టించుకోదు. అలనాటి నటి సావిత్రీ, రాజబాబు, ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కోవలోకే వస్తుంది సింధు.
అంజలి నటించిన మొదటి సినిమా ‘షాపింగ్ మాల్’ గుర్తుండే ఉంటుంది కదా ఆ సినిమాలో నటించింది సింధు. ఆ తర్వాత కొన్ని సినిమాలలో సహాయ నటి పాత్ర పోషించింది. 2020లో బ్రెస్ట్ క్యాన్సర్ కు గురైంది. అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమెది మధ్య తరగతి కుటుంబం. సినిమాల్లో వచ్చిన డబ్బులు అంతంత మాత్రమే. దీంతో నాణ్యమైన చికిత్స కూడా తీసుకోలేకపోయింది. చేతిలో ఉన్న కాస్త డబ్బులు అయిపోయిన తర్వాత హాస్పిటల్ లో చేరింది. అయితే తోటి నటులు ఆమెను ఆదుకోలేకపోయారు. దీంతో ఆమె అనారోగ్యం మరింత పెరిగింది.
కొన్ని రోజులకు ముందు ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కిలిపక్కంలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేరింది. పరిస్థితి మరింత విషమించడంతో సోమవారం తెల్లవారు జామున 2.15 గంటలకు చనిపోయింది. చిన్న వయస్సులోనే తోటి నటి మరణించడంతో నటీనటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాల్యం నుంచి ఆమె కష్టాలతోనే సహజీవనం చేస్తుందని, 14వ ఏటనే పెళ్లి చేయగా.. సంవత్సరం తిరిగేలోపు బిడ్డకు జన్మనిచ్చిందని, ఇప్పుడు క్యాన్సర్ తో ఆమె చనిపోవడంతో కుటుంబం మరింత విలపిస్తోందని తోటి నటులు చెప్పారు.