Baby director : యంగ్ బ్యాచ్ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీ రోల్స్ పోషించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘బేబీ’.. జులై 14న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఫస్ట్ షోతోనే మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేమ కథగా తెరకెక్కిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేసారు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యిన ఈ సినిమా ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది.
చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన బేబీ గురించి ఆ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సాయి రాజేష్ గురించి ఏదొక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంది.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాములు ప్రభంజనం చూపించడం లేదు.. యూత్ బాగా కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపించి నిర్మాతల జేబులను నింపింది.
ఈ సినిమాపై ఇండస్ట్రీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా బేబీ డైరెక్టర్ సాయి రాజేష్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అయ్యింది. ఆనంద్ కు వైష్ణవి గురించి హర్ష నిజం చెప్పే సీన్లో సైలెన్స్ గా ఉంటేనే ప్రేక్షకులు బాగా ఫీల్ అవుతారని అందుకే ఎలాంటి డీటీఎస్ మిక్సింగ్ చేయలేదని తెలిపారు.. అయితే ఆ సీన్ లో ప్రేక్షకులు అందరు కూడా ఆనంద్ కు హ్యాపీ బర్త్ డే అని చెబుతూ అరుస్తున్నారట..
ఇక్కడ ఇంత పెయిన్ ఫుల్ సీన్ లో జరుగుతుంటే ప్రేక్షకులు మాత్రం అలా చేస్తున్నారు.. థూ నా బతుకు అని డైరెక్టర్ సాయి రాజేష్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ను చూసిన ఆనంద్ పగలబడి మరీ నవ్వుతున్న ఎమోజీలను షేర్ చేసాడు.. అలాగే నెటిజెన్స్ కూడా సీరియస్ గా సీన్ తీస్తే సిల్లీగా మారిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.