
Ragi Ambali : మనకు ధాన్యాలతో ఎంతో లాభం కలుగుతుంది. రోజు రాగులతో తయారు చేసుకునే అంబలి తాగితే రోజంతా ఉత్సాహం కలుగుతుంది. రాగులతో తయారు చేసిన అంబలి తాగితే ఎండాకాలంలో చల్లదనం కలుగుతుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీని వల్ల మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
రాగి అంబలి తాగడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. రక్తపోటు వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని రాగి అంబలి నివారిస్తుంది. బరువును తగ్గిస్తుంది. అధిక బరువును నిరోధిస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు మనకు ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఇలా రాగి అంబలిని రోజు తాగుతుంటే మనకు బలం చేకూరుతుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. రాగుల అంబలి తాగితే మన కడుపులో అజీర్తి సమస్య పోతుంది. తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావడానికి సాయపడుతుంది. ఎముకలు బలంగా మారడానికి ఉపయోగపడుతుంది. ఎముకల్లో బలం లేకపోతే సమస్యలు వస్తాయి. జాయింట్లలో చప్పుడు వచ్చి కీళ్లనొప్పులు వస్తుంటాయి. ఈ సమస్యల నుంచి రాగి అంబలి రక్షిస్తుంది.
కాలేయానికి సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది. రక్తహీనత సమస్య నివారిస్తుంది. మహిళల్లో ఎక్కువగా కనిపించే సమస్య రక్తహీనత. దీనికి రాగి అంబలి చక్కని పరిష్కారం చూపుతుంది. శరీరంలో పేరుకుపోయే చెడు కొవ్వును కరిగిస్తుంది. ఇలా రాగి అంబలితో మన శరీరం ఎన్నో రకాలుగా లాభం పొందుతుంది. అందుకే దీన్ని రోజు తీసుకోవడం మంచిదే.