
Anasuya : అనసూయ భరద్వాజ్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. యాంకర్ గా జబర్దస్త్ కామెడీ షోలో హాట్ హాట్ గా నిలిచి కుర్రకారు గుండెల్లో గుడి కట్టేసింది. ప్రస్తుతం వెరైటీ క్యారెక్టర్స్ తో సినిమాల్లో కూడా రాణిస్తోంది. గ్లామర్ షో, తన డ్రెస్సింగు గురించి కామెంట్స్ చేసిన నెటిజన్స్ కు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తూనే ఉంటుంది ఓ సినిమా ఫంక్షన్ లో పుష్ప-2 గురించి రిపోర్టర్ అడిగన ప్రశ్నకు కొంటెగా సమాధానం చెప్పింది.
ఆడియో ఫంక్షన్లలో, టీవీ షోలలో యాంకర్ గా, ఓపెనింగ్స్ గెస్ట్ గా వెళుతూ తన కెరీర్ బిజీ యాక్టర్ గా మారిపోయింది అనసూయ భరద్వాజ్. రంగస్థలంలో రంగమ్మత్త, పుష్పలో దాక్షాయణి, విమానం సినిమాలో వేశ్య పాత్రలో జీవించేసింది. జబర్దస్త్ కామెడీ షో లో తన అందచందాలతో ఆకర్షణ గా నిలిచి తన సత్తా చాటుకుంది. తన అందం గురించి, వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి విమర్శలు రాస్తే మాత్రం తప్పక రియాక్ట్ అవుతుంది.
పుష్ప ఫస్ట్ పార్ట్ లో దాక్షయణిగా మెప్పించిన అనసూయ పుష్ప-2లో కీలక రోల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేసేందుకు చిత్ర బృందం రెడీ అయింది. సినిమాకు సంబంధించిన అప్ డేట్, ఆమె క్యారెక్టర్ గురించి విలేకరులు అడగ్గా చెప్పేందుకు ఇష్టపడలేదు. “చెప్పొచ్చని చెప్పారా మీకెవరైనా చెప్పారా అమ్మో నన్ను తిడతారు.. నాకు భయం నాకు చీవాట్లు తప్పవు. నేను చెప్ప అంటూ కుండ బద్దలు కొట్టేసింది.
సంపత్ నంది దర్శకత్వంలో జగపతిబాబు, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తోన్న సింబా చిత్రంలో మంచి క్యారెక్టర్ లో నటిస్తోంది. సింబా సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించగా.. కార్యక్రమానికి అనసూయ హాజరైంది. ఒక తెలుగమ్మాయికి ఇన్ని భాషల్లో అవకాశాలు రావడం చాలా గొప్పగా ఉంది. కాకపోతే గ్లామర్ ప్రొజెక్ట్ చేద్దామనుకుంటున్న. దిస్ ఇస్ మై బాడీ నా ఇష్టం అంటూ మరో సారి రెచ్చిపోయింది. నాలాగా ఎవరూ ఉండకూడదని అనుకుంటున్నారు.