
wedding pews : పెళ్లి జరగిన తర్వాత దంపతులు కొట్టుకోవడం కామనే కానీ.. ఇక్కడ పెళ్లికి ముందే పెళ్లి పీటలపైనే వధువు, వరుడు కొట్టుకున్నారు. ఇది దేనికి దారి తీసిందంటే వారిద్దరూ విషం తాగే వరకు. ఇందులో వరుడు మృతి చెందగా, వధువు సీరియస్ గా ఉంది. ఈ వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మరికొన్ని నిమిషాల్లో తాళి తంతు ముగుస్తుందనగా వధువు, వరుడి మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇండోర్ లో ఈ ఘటన జరిగింది. కనాడియా ప్రాంతంలో ఆర్యసమాజ్ ఆలయంలో 21 సంవత్సరాల యువకుడికి 20 సంవత్సరాల యువతితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి తంతు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వధువు, వరుడి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇందులో తీవ్ర అసహనానికి లోనైన వరుడు విషం తాగాడు. ఈ విషయాన్ని వధువుకు చెప్పగా ఆమె కూడా విషం తాగింది.
దీంతో ఇద్దరిని స్థానికంగా ఉండే హాస్పిటల్ కు తరలించారు. ఇద్దరి పరిస్థితి సీరియస్ గాఉండగా వరుడు హాస్పిటల్ కు తీసుకచ్చేలోగానే మరణించాడు. ఇక వధువు పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం పెద్ద హాస్పిటల్ కు తరలించారు.
ఈ గొడవకు కారణం గురించి ఆరా తీయగా తనను పెళ్లి చేసుకోవాలని పెళ్లి కూతురు కొన్ని రోజులుగా వరుడిపై ఒత్తిడి తెస్తోందని అందుకే ఆయన సూసైడ్ చేసుకున్నాడని వరుడి తరుఫు బంధువులు పోలీసులకు తెలిపారు. తాను ఉద్యోగం కోసం చూస్తున్నానని ఒక రెండేళ్లు ఆగితే ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకుంటానని వధువుకు చెప్పినా వినలేదని, అందుకే వరుడు విషం తాగినట్లు చెప్పారు. వరుడు విషం తాగడంతో తను కూడా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయించుకుందని వధువు తరుపు వారు చెప్తున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.