Bride Was Kidnapped :
నేటి కాలంలో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ల కంటే ప్రేమ వివాహాలే ఎక్కువవుతున్నాయి. దీంతో పరువు కోసం తమ కూతురును వారికి ఇస్తామనా అనే ఉద్దేశంతో కిడ్నాప్ లు సైతం ఎక్కువగానే కొనసాగుతున్నాయి. దీంతో కిడ్నాప్ ల తంతు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే వధువు తరఫు బంధువులు కిడ్నాప్ కు పాల్పడిన సంఘటన రాజస్థాన్ లో సంచలనం కలిగించింది.
వివరాల్లోకి వెళితే బికనీర్ పరిధిలోని రాంపుర ప్రాంతానికి చెందిన ఓ యువతి ముఖేష్ నాయక్ అనే యువకుడిని ప్రేమించింది. కొన్నాళ్లపాటు వీరి ప్రేమాయణం సాగింది. చివరకు పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాల వారితో చెప్పారు. దానికి వారు అంగీకరించారు. ఇంకేముంది సోమవారం రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇరు కుటుంబాలు రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బయలుదేరారు.
పక్కా ప్లాన్ లో భాగంగానే కొద్ది సేపట్లో పెళ్లి అనగా వరుడి సమక్షంలోనే వధువు బందువులు ఆమెను కిడ్నాప్ చేశారు. వరుడి కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆగలేదు. ఆమెను కారులో కూర్చోబెట్టుకుని వెళ్లిపోయారు. దీంతో వరుడు ఆశ్చర్యపోయాడు. జరుగుతున్న తతంగం చూసి ఖంగుతిన్నాడు. ఇదేమిటి విచిత్రం ముందేమో ఒప్పుకుని ఇప్పుడేమో ఇలా తీసుకెళ్లారని నోరెళ్లబెట్టాడు.
సోమవారం జరిగిన ఈ సంఘటన సోషల్ మీడియలో వైరల్ గా మారింది. అమ్మాయి తరఫు వారు చేసిన నిర్వాకానికి నివ్వెర పోయారు. అందరి ముందేమో ఒప్పుకుని చివరకు కిడ్నాప్ డ్రామా ఆడటంపై అందరు అవాక్కయ్యారు. పెళ్లి కూతురు బంధువులు చేసిన పనికి తిట్టిపోస్తున్నారు. ఇష్టం లేకపో తే ముందే చెప్పాలి కానీ ఇలా పెళ్లి సమయానికి కిడ్నాప్ డ్రామా ఆడటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.