AP Weather : ఏపీని ఎండలు మండిస్తున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే వేసవికాలం ఎలా ఉండనుందో ఊహించుకుంటేనే భయమే స్తోందని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. శివరాత్రి వెళ్లకుండానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తు న్నాడు. ఈ సంవత్సరం ఎండలు బాగానే ఉంటా యని వాతావరణశాఖ ఇటీవలే వెల్లడిం చింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్ర తలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతు న్నాయి. కొన్ని జిల్లాల్లో 38 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. వాస్తవానికి ఫిబ్రవరి నెలలో ఇంత ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉండవు.
రాష్ట్రంలో వారం రోజుల నుంచి ఎండల తీవ్రగా అధికంగా ఉంటోంది. రాయలసీమలో మరింత ఎక్కువగా ఉంటున్నాయి. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో 38 డిగ్రీల చొప్పున నమోదవుతున్నాయి. రాత్రివేళ కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఇవి కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. రాబోయే వేసవికాలంలో తీవ్ర వడగాడ్పులు కూడా తప్పవని వాతావర ణశాఖ అంచనా వేస్తోంది.
పసిఫిక్ మహా సముద్రంలో బలంగా ఉన్న ఎల్‌ని నోతో పాటు మరికొన్ని కారణాలు పగటి ఉష్ణోగ్రత ల పెరుగుదలకు కారణమవుతున్నాయని వాతావ రణశాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణం గా ఫిబ్రవరిలో చిరుజల్లులు కురుస్తుంటాయి. దీని వల్ల ఎండ వేడిమి చాలా తక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం అటువంటి వాతావరణం కనప డటంలేదు.