29.3 C
India
Tuesday, February 10, 2026
More

    బాంబు పేల్చిన బండి.. ఆ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు ప్రకటన

    Date:

    ఎన్నికలు సమీపిస్తున్న వేల రాజకీయ నాయకుల అంచనాలు, సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. తెలంగాణలో నిద్ర మత్తులో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక గెలుపుతో లేచింది. లేవడమే కాదు పరుగెడుతుందనే చెప్పాలి. ఇక జూపల్లి, పొంగులేటి కూడా కాంగ్రెస్ లో చేరుతారన్న సంకేతాలతో మరింత జోష్ పెరిగింది. కొన్ని రోజులుగా వర్గపోరుతో కుమ్ములాటలో ఉన్న హస్తం పార్టీ మెల్ల మెల్లగా జనాల నోళ్లోల నానుతూ వస్తుంది.

    ఇక భారతీయ జనతా పార్టీ గురించి చూసుకుంటే బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ బాగా ప్రాచుర్యం పొందింది. తెలంగాణలో ఓటు శాతం కూడా గతం కంటే పెరిగింది. దీనికి తోడు కొందరు సీనియర్ నాయకుల చేరికలు కూడా పార్టీకి బాగా కలిసి వచ్చాయి. ఒకటి రెండు సీట్లకే పరిమితమైన జీహెచ్ఎంసీలో దాదాపు 40కి పైగా సీట్లను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వచ్చిన దుబ్బాక, హుజూరాబాద్ ను కూడా గెలిచి సీట్ల సంఖ్య పెంచుకోగలిగింది. తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యాన్మాయంగా ఉన్న పార్టీగా గుర్తింపు సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యింది. అయితే ఇటీవల పార్టీలో అధ్యక్ష పదవికి పోటీ పెరుగుతున్నా. ఢిల్లీ పెద్దలు మాత్రం మార్చేది లేదని తేల్చి చెప్తున్నారు. బండి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని.. ఈటలకు ప్రచార బాధ్యతలను అప్పగించారు.

    కుత్బుల్లాపూర్ లోని బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఇప్పటి వరకు బీజేపీతో 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, సమయం కోసం వారు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మిత్రులన్న ఆయన కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేది ఏ పార్టీ అయినా సరే బీజేపీ కలవబోదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకులు దాదాపు 30 మందికి ఇప్పటికీ కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నాడని.. ఆ విషయం రేవంత్ కు కూడా తెలుసని ఆయన ఆరోపణలు చేశాడు. కాంగ్రెస్ పతనం గ్రేటర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందన్నారు.

    ఏదో కర్ణాటకను చూసుకొని హస్తం ఎగిరిపడినా తెలంగాణలో పట్టించుకునే టోడు లేడన్నాడు. ఒక్క ఎమ్మెల్యే గెలిచినా పార్టీ మారకుండా ప్రజల కోసం కొట్లాడిన పార్టీ బీజేపీ అని చెప్పారు. కాంగ్రెస్ నుంచి దాదాపు 19 మంది బీఆర్ఎస్ లో కలిసినప్పుడే కాంగ్రెస్ కహానీ ముగిసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ మెడలు వంచేది బీజేపీనే అని రాష్ట్రం మొత్తానికి తెలుసు అన్నారు. అమిత్ షా, మోడీ నాయకత్వాన్ని దేశం మొత్తం అక్కున చేర్చుకుందని, తెలంగాణ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం ఎదురు చూస్తున్నదన్నారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Encounter : కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్: 30 మందికి పైగా మావోయిస్టులు మృతి?

    Encounter : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల అటవీ ప్రాంతం మరోసారి రక్తసిక్తమైంది....

    Telangana : హెచ్‌సీయూ విద్యార్థుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం

    Telangana Deputy CM : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్.. ఆమె ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

    Meenakshi Natarajan : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా మీనాక్షి నటరాజన్‌...

    Telangana : తెలంగాణ లో ఉగాది తర్వాత ముఖ్యమంత్రి మార్పు..!

    -తీన్మార్ మల్లన్న వెనుక రేవంత్ రెడ్డి..? Telangana  CM : ఉగాది పండుగ...