Funds For AP :
సౌత్ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నెలల వ్యవధిలోనే ఉండడంతో బీజేపీ కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలపై వరాల జల్లు కురిపిస్తుంది. బండిని పార్టీ అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టి మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు సోయం బాపూరావును కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అధ్యక్షుడిని మార్చిన కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అంటూ కోట్లాది రూపాయల నిధులను విడుదల చేస్తుంది. ఈ భారీ ప్యాకేజీతో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలు అభివృద్ధి చెందనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో బాగంగా బుందేల్ ఖండ్ తరహాలో కోట్లాది రూపాయల నిధులను ఏపీకి ఇవ్వనుంది. ఈ మేరకు ఈ రోజు (జూలై 5వ తేదీ) వైసీపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్యాకేజీతో పాటు ప్రభుత్వ పాలన గురించి ఆయన బీజేపీ ముఖ్య నాయకులను కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల డెవలప్ మెంట్ కోసం రూ. 22వేల కోట్లను ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. ఈ డబ్బుతో ముఖ్యంగా వెనుకబడిన జిల్లాల్లో డెవలప్ మెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచిస్తోంది.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించుకోవడంలో వైఎస్ జగన్ ను విజయం సాధిస్తున్నారని ఏపీ ఓటర్లు, ప్రజల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఐదేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఈ తరహాలో నిధులను ఎన్నడూ తెచ్చుకోలేకపోయారని చంద్రబాబుపై విమర్శలు కురిపిస్తున్న వారు లేకపోలేదు. ఏది ఏమైనా ఈ ప్యాకేజ్ తో జగన్ ప్రభుత్వంపై ప్రజలు మరింత భరోసా పెంచుకునేట్లు కనిపిస్తుంది. ‘సరైనోడు సీట్లో ఉంటే రిజల్ట్ ఇలానే ఉంటుందని సూపర్ జగనన్న..’ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.
https://twitter.com/sweety_00099/status/1676436109411209216?s=20