
Name starts with S : పేరులో మన జాతకం మొత్తం ఉంటుంది. మన పేరులోని మొదటి అక్షరం పట్టే మన నక్షత్రం, రాశి చెబుతారు. అలా పేరులోని మొదటి అక్షరంతో చాలా విషయాలు తెలుస్తాయి. మన ప్రధానమంత్రుల్లో అందరికి ఆర్ అనే అక్షరం ఉందట. అలా కొన్ని అక్షరాలు అలా ముద్రపడిపోతాయి. సినిమాల్లో సైతం ఆర్ అనే అక్షరం ఉన్నవారే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఇలా పేరులో మొదటి అక్షరంతో ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఎస్ అనే అక్షరం అత్యంత మిన్నగా భావిస్తుంటారు. ఎ,జె,ఓ,ఎస్ అనే అక్షరాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ అక్షరం గల వారు జీవితంలో రాణిస్తారు. ఇలా ఎస్ అనే అక్షరం మొదటిగా ఉన్న వారు జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగడం ఖాయం. ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు మంచి ప్రేమ కలిగి ఉంటారు. ఎదుటి వారిని తన మాటలతో ఆకట్టుకుంటారు.
ఎస్ అనే అక్షరం అత్యంత శక్తివంతమైనదని భావిస్తారు. ఆ అక్షరంలోనే మహత్తు ఉందని నమ్ముతారు. వీరు నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళతారు. మాటల ద్వారా అందరిని మంత్రముగ్దులను చేస్తారు. భావ వ్యక్తీకరణలో వీరికి ప్రత్యేక శైలి. ఆకట్టుకోవడంలో అందెవేసిన చేయి.
జాలి, దయ, కరుణ కలిగి ఉంటారు కష్టాల్లో ఎవరైనా ఉన్నారంటే వారికి అండగా నిలుస్తారు. సహాయం చేయడానికి వెనకాడరు. నిజాయితీగా ఉంటారు. నమ్మకానికి అమ్మలాంటి వారు. ఏదైనా మాట ఇస్తే తప్పకుండా చేస్తారు. ఇలా ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారు జీవితంలో ఎదిగేందుకు నిరంతరం కష్టపడతారు. జీవితాన్ని అనుకూలంగా మలుచుకుంటారు.