Father Gift to Son iphone : అతనో చెత్త (స్క్రాప్) వ్యాపారి. ఏదో పొట్ట తిప్పల కోసం చిన్న సంపాదన.. అయినా కొడుకును చదివించాడు. అతడు పరీక్షలో ఫస్ట్ రావడంతో ఆయన ఒక పని చేశాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏ వృత్తి చేస్తున్నా తండ్రి ప్రేమ అనేది ఉంటుంది కదా అని చెప్తున్నాడు. ఇదొక్కటే కాదు గతంలో కూడా తన కొడుకు చదువులో మంచి ప్రతిభ చూపుతున్నాడని చాలా ఐఫోన్లు కొనిచ్చినట్లు చెప్తున్నాడు. అయితే ఇది ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియలేదు. ఘర్ క కలేష్ అనే ఎక్స్ అకౌంట్లో ఈ వీడియో షేర్ అయ్యింది. తక్కువ సమయంలోనే భారీ వ్యూవ్స్ ను దక్కించుకుంది.
వీడియోలో, ఉత్సాహంగా ఉన్న తండ్రి గర్వంగా ఐఫోన్‌ను పట్టుకొని చిరస్మరణీయమైన ఈవెంట్‌ను రికార్డ్ చేశారు. మాట్లాడేటప్పుడు అతని భాష కూడా స్పష్టంగా లేదు. అయినప్పటికీ, అతను తన కొడుకు సాధించిన విజయాలపై గర్విస్తూ తన స్క్రాప్ వ్యాపారం గురించి మాట్లాడుతున్నట్లు అనిపించింది.
స్క్రాప్ డీలర్ తన కోసం రూ. 85,000 విలువైన ఐఫోన్‌ను కొనుగోలు చేశాడు తన కొడుకు కోసం రూ. 1.5 లక్షల విలువైన ఐఫోన్-16ని బహుమతిగా ఇచ్చాడు. తన కొడుకు ఇటీవల జరిగిన బోర్డు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడని అభినందిస్తూ బహుమతిగా ఐఫోన్ 16 ఇచ్చినట్లు చెప్పుకచ్చాడు. పని ఏదైనా తండ్రి ప్రేమ అద్భుతమని చెప్పుకుంటున్నారు.
వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయిన గంటల్లోనే వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘అతని కొడుకు పరీక్షలో మంచి ప్రతిభ చూపడం ఆయన ఐఫోన్ ఇవ్వడం కన్నా చాలా ఎక్కువ’ అన్నాడు. మరొక వినియోగదారు ఇలా వ్యాఖ్యానించారు. ‘ఈ వ్యక్తి చరునవ్వే కోట్లాది రూపాయలతో సమానం. ఒక నెటిజన్ ‘కొడుకు తన తండ్రికి మిలియన్ డాలర్ల బహుమతి’ అని వ్యాఖ్యానించారు.
Father’s Priceless Gift: Junk Dealer Gifts Multiple Iphones Worth ₹ 1.80 Lacs to Son For Top Board Results pic.twitter.com/brrSI04qxf
— Ghar Ke Kalesh (@gharkekalesh) September 27, 2024