33.4 C
India
Wednesday, May 21, 2025
More

    West Godavari District : బ్యాటరీని మింగిన చిన్నారి.. ఎండోస్కోపీ ద్వారా తొలగించిన వైద్యులు

    Date:

    West Godavari District
    West Godavari District

    West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ మింగడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు తొలగించారు. దీంతో ఆ చిన్నారికి ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకువెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ లో చిన్నారిని హుటాహుటిన తరలించారు.

    విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి వైద్యులు చిన్నారికి ఎక్స్ రే తీసి చూడగా, బ్యాటరీ కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ కనిపించింది. శస్త్ర చికిత్స అవసరం లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష, ఎం.ఎస్.గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బ్యాటరీని తొలగించారు.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Euphoria Musical Night : రౌండ్ టేబిల్స్ దగ్గర కూర్చోవాలంటే లక్ష. చంద్రబాబు నాయుడితో సహా ముక్కుపిండి వసూలు

    Euphoria Musical Night : రౌండ్ టేబిల్స్ వేసిన దగ్గర కూర్చోవాలంటే...

    Euphoria Musical Night : విజయవాడలో యూఫోరియా మ్యూజికల్ నైట్.. పాల్గొన్న యలమంచిలి కృష్ణమూర్తి గారు

    Euphoria Musical Night : విజయవాడలో తలస్సేమియాతో బాధపడుతున్న పిల్లల సహాయార్థం...

    Pakistan colony : పాకిస్తాన్ కాలనీ పేరు మార్పు..ఏం పేరు పెట్టారంటే?

    Pakistan colony : ఆంధ్రప్రదేశ్‌ లో పాకిస్తాన్ పేరుతో ఓ కాలనీ ఉందన్న...

    Vijayawada : పెరుగుతున్న విజయవాడ జనాభా.. ప్రస్తుతం ఎంతమందంటే?

    Vijayawada : విజయవాడ దినదినాభివృద్ధి చెందుతోంది. జనాభా పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన పదేళ్లలో...