
ఈ మధ్యనే ఈ షోలో పాల్గొన్న జైద్ హదీద్, ఆకాంక్ష పూరి మధ్య వివాదం వైరల్ అయ్యింది. ఆకాంక్ష పూరీ తనను తప్పుగా తాకాడని జైద్ హదీద్ పై ఆరోపించింది. ఇది పెద్ద వివాదం అవ్వగా తాజాగా వీరిద్దరూ కలిసి కెమెరా ముందు లిప్ లాక్ పెట్టుకుంటున్న సన్నివేశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈసారి నెటిజెన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు.
బిగ్ బాస్ ఓటిటి 2 జూన్ 17 నుండి జియో సినిమాలో ప్రసారం అవుతుంది. ఈ షో స్టార్ట్ అయినప్పటి నుండి ప్రేక్షకులను ఆకర్షించడానికి నిర్వాహకులు రకరకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ షో స్టార్ట్ అయిన 24 గంటల్లోనే ఒక కంటెస్టెంట్ ను పంపించేసి చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత జైద్ హదీద్, ఆకాంక్ష పూరి మధ్య వివాదం వైరల్ అయ్యింది.
ఇక ఇప్పుడు వీరిద్దరూ ముద్దు పెట్టుకోవడం అది కూడా ఫ్రెంచ్ కిస్ 30 సెకన్ల పాటు పెట్టుకోవడం వైరల్ అయ్యింది. బిగ్ బాస్ డేర్ గేమ్ పేరుతో టాస్క్ ఇవ్వగా ఇందులో ఈ ఇద్దరు కూడా పాల్గొన్నారు. ముందుగా ఈ టాస్క్ కు ఎవ్వరూ ముందుకు రాకపోయిన ఆ తర్వాత ఈ ఇద్దరు ఈ టాస్క్ లో ముందుకు వచ్చి కిస్ పెట్టుకోవడంతో మరికొంత మంది కూడా ఈ టాస్క్ లో పాల్గొన్నారు. దీంతో ఈ షో నిర్వాహకులపై నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి టాస్క్ లు పెట్టాడం ఏంటని దుమ్మెత్తిపోస్తున్నారు.