
Adipurush : వరుస ప్రమోషన్స్ తో ఈ సినిమాపై ఆసక్తి కలిగేలా చేసారు ఆదిపురుష్ మేకర్స్.. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమాల్లో ఇది ఒకటి.. ఈ సినిమా వచ్చే నెల జూన్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా ప్రమోషన్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ తో రోజురోజుకూ హైప్ పెంచుతూ పోతున్నారు.
ఈ మధ్య రిలీజ్ చేస్తున్న అన్ని ప్రమోషనల్ కంటెంట్ భారీగా హైప్ పెంచేస్తుంది.. ట్రైలర్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ తో భారీగా అంచనాలు పెంచేసిన టీమ్ ఇప్పుడు మరిన్ని బిగ్గెస్ట్ ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా వచ్చిన రెండు సాంగ్స్ కూడా ఆడియెన్స్ ను ఎంతగానో అలరిస్తున్నాయి.. ఎక్కడ విన్న జై శ్రీరామ్ అనే సాంగ్ నే వినిపిస్తుంది.
అలాగే రామ్ సీతారామ్ సాంగ్ కూడా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. ఇక అతి త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. జూన్ 6న ఈ ఈవెంట్ ను తిరుపతిలో గ్రాండ్ గా చేయనున్నారు అనే విషయం తెలిసిందే.. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ బడ్జెట్ గురించి తాజాగా అందుతున్న సమాచారం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఈ ఈవెంట్ కు 200 మంది డ్యాన్సర్లు, 200 మంది సింగర్స్ రాబోతున్నారట.. వీరు స్టేజ్ మీద లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారట.. అంతేకాదు ఈ ఈవెంట్ మొత్తం ఆధ్యాత్మికత క్రియేట్ అయ్యేలా సెట్టింగ్స్ వేస్తున్నారట. మొత్తంగా ఈ ఒక్క ఈవెంట్ కోసమే 2 నుండి 3 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ బడ్జెట్ లెక్కలు విని ఒక చిన్న సినిమా ఈ బడ్జెట్ తో తీయవచ్చు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి చివరకు ఈ సినిమా ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి..






