
The cruelest place : ప్రతిష్టాత్మకమైన దర్శకుడు జేమ్స్ కెమెరూన్. అతడు తీసిన టైటానిక్ వరల్డ్ రికార్డు సాధించింది. సముద్రంలో మునిగిపోయిన టైటానిక్ నౌక కథతో ఆయన తీసిన కథ ఆద్యంతం ఆకట్టుకుంది. అప్పట్లో దానికి అన్ని రికార్డులు దక్కాయి. తరువాత అవతార్ కూడా మంచి హిట్ సాధించింది. తరువాత అవతార్ 2 కూడా తీశాడు. ఇలా కెమెరూన్ టైటానిక్ సినిమా చాలా రికార్డులు సొంతం చేసుకుంది.
టైటానిక్ మునిగిన ప్రాంతానికి కెమెరూన్ 33 సార్లు వెళ్లి వచ్చాడు. 13 వేల అడుగుల లోతులో ఉండిపోయిన చరిత్ర సజీవంగా కళ్లకు కట్టినట్లు చూపించడానికి ఎన్నో పాట్లు పడ్డాడు. సముద్ర గర్భంలో ఉన్న టైటానిక్ ను చూడటానికి వెళ్లిన ఐదుగురు సభ్యు బృందం టైటాన్ పేలిపోవడంతో అందులో ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తెలిపింది.

ఈ భూమి మీద అత్యంత క్రూరమైన ఇది కూడా ఒకటని కెమెరూన్ అభిప్రాయపడుతున్నారు. సముద్ర గర్భం ఇతివృత్తంగా ఎక్స్ పెడిషన్ బిస్ మర్క్, ఘోస్ట్ ఆఫ్ ది అబేస్ అండ్ ఏలియన్స్ ఆఫ్ ది డీప్ డాక్యుమెంటరీ చిత్రాలను తీశారు. టైటానిక్ సినిమా తీయడం ఓ కలగా చెబుతున్నారు. సబ్ మెరైన్ సముద్ర గర్భంలో మునిగిన ఓడ గురించి సినిమా తీయడం వెనుక ఎంతో కష్టముందన్నాడు.
జేమ్స్ కెమెరూన్ 1995లో తొలిసారి ఓ రష్యన్ సబ్ మెరైన్ లో ప్రయాణించి టైటానిక్ మునిగిపోయిన ప్రాంతాన్ని వీడియో చిత్రీకరించి తీసుకొచ్చారు. ప్రస్తుతం మునిగిపోయిన టైటానిక్ గురించి కెమెరూన్ తన అనుభవాలు పంచుకున్నారు. నేషనల్ జియోగ్రఫిక్ చానల్ కోసం కెమెరూన్ ఈ సాహసం చేశారు. సముద్ర అడుగు భాగానికి చేరుకుని దాన్ని చిత్రీకరించం సాహసమే.