New ration cards : ఏపీలోని కూటమి సర్కార్ మరో ఎన్నికల హామీని నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు అందించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్ కార్డులు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈమేరకు ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రక్రియను ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది
డిసెంబర్ నుంచి నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నారని సమాచారం .డిసెంబర్ 2 నుంచి 28 వరకు ధరఖాస్తు స్వీకరణ ప్రక్రియ కొనసాగించే అవకాశముంది. కాగా ఏపీలో చాలారోజుల నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ఆగిపోయింది. దీంతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు ప్రతీ సంక్షేమ పథకానికి రేషన్ కార్డును ప్రామాణీకంగా తీసుకుంటున్నాయి.
కూటమి సర్కార్ త్వరలోనే నూతన రేషన్ కార్డులు జారీ చేయనుండటంతో అర్హులకు ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. సంక్రాంతి నాటికి కొత్తగా మూడు లక్షల కార్డులను పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అనర్హుల కార్డులు తొలగించే అవకాశాలు సైతం ఉన్నాయి. దీంతో గతంలో కార్డులు దక్కించుకున్న అనర్హుల్లో ఆందోళన వ్యకమవుతుందని సమాచారం.