Mughal emperors : భారతదేశాన్ని పాలించిన మొఘల్ సామ్రాజ్యం ఒకప్పుడు ఎంతో వైభవంగా విలసిల్లింది. కానీ ఆ సామ్రాజ్యం చివరి చక్రవర్తి బహదూర్ షా జాఫర్ వారసులు నేడు దయనీయమైన జీవితాన్ని గడుపుతున్నారు. బహదూర్ షా జాఫర్ మునిమనవరాలైన సుల్తానా బేగం కోల్‌కతాలోని ఓ మురికివాడలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.
చరిత్రలో చక్రవర్తులుగా వెలుగొందిన తమ పూర్వీకుల గురించి చెబుతూ, నేడు కనీసం తిండి, నిలువ నీడ లేక ఎంతో దుర్భరంగా జీవిస్తున్నారు.సుల్తానా బేగం భర్త మరణించిన తర్వాత ఆమె జీవితం మరింత దుర్భరంగా మారింది.
ప్రస్తుతం ఆమె నెలకు రూ.6 వేల పింఛన్‌తో తన ఆరుగురు పిల్లలను పోషిస్తున్నారు.ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందక, స్వచ్ఛంద సంస్థల సహాయంతో జీవనం సాగిస్తున్నారు. మొఘల్ చక్రవర్తులు ఆలయాలపై అనేక దుర్మార్గాలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.