Plots to the poor : రాష్ట్ర రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం జగన్ ప్రభుత్వం తెచ్చిన జీవోకు లైన్ క్లియర్ అయ్యింది. దీనిపై సుప్రీం కోర్టు జగన్ ప్రభుత్వానికి ఊరట కల్పించింది. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని అక్కడి రైతులు నిరసిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కేఎం జోసెఫ్, అరవింద్ కుమార్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే ఆర్ 5 జోన్ లో పట్టాల పంపిణీపై సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి.
పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇవ్వచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ విషయంపై ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో వాదనలు జరుగగా హై కోర్టు కూడా జగన్ సర్కారుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రైతులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే హై కోర్టు తీర్పును సమర్ధిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. రాజధానిపై ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఉత్కంఠతకు తెర పడింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని సుప్రీం ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే చట్ట ప్రచారం 5శాతం ఈడబ్ల్యూఎస్ కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించింది.
తాజా తీర్పు నేపథ్యంలో 51 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఈ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తుంది. గురువారం (మే 18)న అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయనుంది. ఇక పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకునేందుకు అన్ని దారులు మూసుకుపోయాయిన జగన్ అభిమానులు అంటున్నారు.