HIV sufferers in Telangana : దేశ వ్యాప్తంగా ఉన్న హెచ్‌ఐవీ బాధితుల సంఖ్యను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో తెలంగాణ ఆరో స్థానంలో ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశ వ్యాప్తంగా బాధితుల సంఖ్య 25.44 లక్షలుగా ఉండగా.. తెలంగాణ రాష్ట్రంలో 1.58 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉన్నారు.
బాధితుల సంఖ్య పరంగా చూస్తే తొలి అయిదు స్థానాల్లో మహారాష్ట్ర 3.90 లక్షలు, ఏపీ 3.20 లక్షలు, కర్ణాటక 2.80 లక్షలు, ఉత్తర్‌ప్రదేశ్ 1.97 లక్షలు, తమిళనాడు 1.69 లక్షల మంది ఉన్నారు.
జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ విడుదల చేసిన ‘ఇండియా హెచ్‌ఐవీ ఎస్టిమేట్స్ 2023’ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. తెలంగాణలోని 1.58 లక్షల మంది బాధితుల్లో 1.54 లక్షల మంది బాధితులు 15 ఏళ్లు పైబడిన వారే కావటం గమనార్హం. వీరిలో 15-24 ఏళ్ల మధ్య వయసు ఉన్న బాధితులు 9,250 మంది ఉన్నారు.
ప్రతి ఏడాది తెలంగాణలో కొత్తగా 2,960 మంది హెచ్‌ఐవీ బారిన పడుతున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. 2023లో ఎయిడ్స్ వ్యాధితో బాధితపడుతూ తెలంగాణలో 2,820 మంది చనిపోయినట్లు నివేదికలో వెల్లడైంది. 2023లో అత్యధికంగా హెచ్‌ఐవీ సోకిన వారి సంఖ్యలో రంగారెడ్డి (421) జిల్లా టాప్‌లో ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.
View this post on Instagram