
Door opened : ఆకాశ మార్గంలో ఏదైనా చిన్న ఆపద కలిగిన మనకు ఎంతో భయం వేస్తుంది. ఎందుకంటే మనం ఉన్నది గాల్లో కావడంతో అంతలా భయపడటం సహజమే. ఈ నేపథ్యంలో ఏషియానా విమానం ఇలాంటి ప్రమాదమే ఎదుర్కొంది. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఏం జరుగుతుందో అని గుండెలు అదిమి పట్టుకున్నారు. చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు అయింది.
దక్షిణ కొరియాలోని డైగు విమానాశ్రయంలో ల్యాండింగ్ కు ప్రయత్నిస్తున్న విమానం డోరు అకస్మాత్తుగా తెరుచుకుంది. దీంతో అందరి గుండెలు జారాయి. అప్పుడు అందులో 194 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరు కూడా కింద పడిపోలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. కొందరికి శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రికి తరలించారు.
అయితే డోరు తెరుచుకోవడానికి కారణం పక్కనే కూర్చున్న ప్రయాణికుడు డోరు హ్యాండిల్ ను నొక్కడంతోనే అది తెరుచుకున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ప్రమాదం తప్పడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. విమాన ప్రయాణమంటేనే గాల్లో ఉండటం. అందుకే ప్రాణాలు గాల్లో కలవకుండా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం.
కానీ ఇక్కడ ఓ ప్రయాణికుడి తప్పిదం వల్ల డోరు తెరుచుకోవడంతో అందరిలో ఆందోళన నెలకొంది. ఏం జరుగుతుందోననే బెంగ అందరిలో పట్టుకోవడం గమనార్హం. చివరకు సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులు క్షేమంగా ఉండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమకు భూమి మీద నూకలు బాకి ఉన్నాయని చెబుతున్నారు.