39.6 C
India
Saturday, April 20, 2024
More

    కేసీఆర్ తో పెట్టుకుంటున్న ఉద్యోగులు.. సమ్మెపై ఉత్కంఠ

    Date:

    kcr
    kcr

    తెలంగాణ విద్యుత్ శాఖలో ఆర్టిజ‌న్ ఉద్యోగులది కీల‌క‌మైన భూమిక‌. వీరు విద్యుత్ శాఖ‌లోని అన్ని విభాగాల్లో క్షేత్ర స్థాయిలో ముఖ్య‌మైన విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. ట్రాన్స్‌కో,జెన్‌కో,ఎస్పీడీఎల్‌,ఎన్‌పీడీ సీఎల్,జిల్లా కార్యాల‌యాల్లో ఆర్టిజ‌న్లు చాలా క్రీయాశీల‌కంగా వ‌ర్క్ చేస్తున్నారు. ఒక విధంగా విద్యుత్ స‌ర‌ఫ‌రాకు ఆర్టిజ‌న్లే గుండెకాయ‌ని చెప్పొచ్చు.

    అలాంటి ఆర్టిజ‌న్లు ప్ర‌స్తుతం త‌మ స‌మ‌స్యల ప‌రిష్కారం కోసం స‌మ్మె బాట ప‌ట్టారు. రాష్ట్ర స‌ర్కార్‌పై జంగ్ సైర‌న్ మోగించారు. నేటి నుంచి ఆర్టిజ‌న్ కార్మికులంద‌రూ స‌మ్మెలో పాల్గొనాల‌ని ప‌లు సంఘాలు పిలుపు నిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే ఆర్టిజ‌న్ ఉద్యోగుల‌ను దారికి తెచ్చుకునేందుకు రాష్ట్ర స‌ర్కార్ ఇప్ప‌టికే ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. ఉద్యోగుల స‌మ్మె వ‌ల్ల విద్యుత స‌ర‌ఫ‌రాకు అంత‌రాయ మేర్ప‌డే అవ‌కాశ‌ముంది. అదే జ‌రిగితే ప‌బ్లిక్ నుంచి ప్ర‌భుత్వం తీవ్ర వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కోనే అవ‌కాశ ముంది. ఈ నేప‌థ్యంలోనే ఆర్టిజ‌న్ కార్మికుల‌ను దారికి తెచ్చుకునేందుకు ఇప్ప‌టికే కొన్ని సంఘాల‌కు సంబంధించిన కీల‌క‌మైన ఉద్యోగుల‌పై ఎస్మా ప్ర‌యోగానికి స‌ర్కార్ సిద్ధ‌మ‌వుతోంది. అందులో భాగంగానే శ‌నివారం తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ సాయిలును ఎస్మా కింద అరెస్ట్ చేయించి మిగ‌తా వారికి ఒక హెచ్చ‌రిక పంపింది.

    మ‌రోవైపు రాష్ట్ర స‌ర్కార్ ఎలాంటి బెదిరింపుల‌కు దిగిన తాము మాత్రం వెన‌క్కు త‌గ్గ‌బోమ‌ని ఆర్టిజ‌న్ కార్మికులు భీష్మించుకొని కూర్చుకున్నారు. త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు రాజీ లేని పోరాటం చేస్తామంటున్నారు కార్మికులు. ముఖ్యంగా ఆర్టిజ‌న్‌లు ప‌లు కీల‌క డిమాండ్ల‌ను స‌ర్కార్ ముందు పెడు తున్నారు.  ఆర్టిజ‌న్ కార్మికుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం రూ.12,600 వేత‌నాన్ని అంద‌జేస్తోంది. అయితే కార్మికులు ఇటీవ‌ల స‌ర్కార్‌పై ఒత్తిడి పెంచ‌డంతో..బేసిక్‌పై 7 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన‌ట్లే ఇచ్చి..మ‌ళ్లీ హెచ్ఆర్ఏలో 6శాతం కోత పెట్టింది. కేసీఆర్ స‌ర్కార్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆర్టిజ‌న్ కార్మికుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది.

    ఇక చాలా రోజులుగా ఆర్టిజ‌న్ కార్మికులు స్టాండింగ్ ఆర్డ‌ర్స్ ర‌ద్దు చేసి ఏపీఎస్ఈబీ స‌ర్వీస్ రూల్స్ అమ‌లు చేయాల‌ని కోరుతున్నారు. కొత్తగా ఆర్టిజ‌న్ కార్మికులుగా అపాయింట్ అయిన వారికి 35 శాతం పీఆర్సీ వ‌ర్తించేలా  నిబంధ‌న‌లు మార్చాల‌ని కోరుతున్నారు. విద్యుత్ శాఖ‌లోని వివిధ పంపిణీ సంస్థ‌లు, ఆప‌రేటివ్ విభాగాల్లో వ‌ర్క్ చేస్తూ..ఐడీ కార్డ్ క‌ల్గిన ఉద్యోగుల‌ను ఆర్టిజ‌న్‌లు గుర్తించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

    తాము ప్ర‌భుత్వం ముందుంచిన డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించే వ‌ర‌కు త‌మ నిర‌స‌న‌ల‌ను కొన‌సాగిస్తామ‌ని కార్మికులు స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే ఆర్టిజ‌న్ కార్మికులు ఇంత ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ప్ప టికీ.. కొన్ని సంఘాలు మాత్రం ఈ స‌మ్మెకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేదు. దీంతో ఆర్టిజ‌న్ కార్మికులు రాష్ట్ర స‌ర్కార్ ముందు పెట్టిన డిమాండ్లు నేర‌వేరుతాయా..? మిగ‌తా కార్మిక సంఘాలు వారికి స‌పోర్ట్‌ ఇస్తాయా..? స‌మ్మె స‌క్సెస్ అవుతుందా..? లేదా..? వారి గోస తీరుతుందా..? లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిందే.

    Share post:

    More like this
    Related

    Elon Musk : ఎలన్ మస్క్ ఇండియా పర్యటన వాయిదా, ఏపీకి మేలు చేస్తుందా?

    Elon Musk : టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఈ నెల...

    Pakistan News : ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

    Pakistan News : పాకస్థాన్ లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి...

    Minister Roja : మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా..?

    Minister Roja : నగరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్కే రోజా...

    Pooja Hegde : పూజ హెగ్డే పెళ్లి పీటలెక్కబోతుంది.. మరి అదృష్టవంతుడు ఏవరంటే?

    Pooja Hegde : పూజ హెగ్డే తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS Losing : బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతోందో తెలుసా?

    BRS Losing : తెలంగాణలో ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ కు...

    Rythu Bandhu : రైతుబంధు అధికార పార్టీకి వరం కానుందా?

    Rythu Bandhu : తెలంగాణ ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఇస్తోంది. రైతు...

    Telangana Muslim : తెలంగాణ ముస్లిం జనాభా కేసీఆర్ పట్ల సంతృప్తిగా లేరా? కారణం ఇదేనా?

    Telangana Muslim : రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లను రాబట్టుకునేందుకు బీఆర్ఎస్...

    BRS : ఆ గ్యాపే బీఆర్ఎస్ కొంప ముంచిందా? 

    BRS: తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం నవంబర్ 30వ...