
GO 111 : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది ఈ రోజు (మే 18, గురువారం) మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కొత్త సెక్రటరీనలో మొదటి కేబినేట్ భేటి నిర్వహించిన సీఎం కేసీఆర్ చల్లని కబురు వెల్లడించారు. దాదాపు 3 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. దశాబ్ది వేడుకలతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీఎస్ శాంతి కుమారి, పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
జీవో 111 అంటే ఏమిటి..?
అనంతగిరి కొండల నుంచి హైదరాబాద్ నగరం మీదుగా కృష్ణా నదిలో కలిసే మూసీ 1908లో ఉగ్రరూపం దాల్చింది. ఆ తర్వాత రెండు జంట జలాశయాలు నిర్మించారు. మూసీ నదిపై ఉస్మాన్ సాగర్ (గంటిపేట), ఈసీపై హిమాయత్ నగర్ జలాశయాల నిర్మించారు. దీంతో నగరానికి వరద ముప్పు తగ్గింది. దీంతో పాటు నగరానికి తాగునీటి కొరత కూడా తీరింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ జలాశయాల్లో నీటినే నగర ప్రజలు తాగునీటిగా ఉపయోగించారు. 8 మార్చి, 1996లో వీటి రక్షణకు అప్పటి ప్రభుత్వం జీవో 111 తెచ్చింది. దీని ప్రకారం రెడు జలాశయాల పరీవాహన ప్రాంతాల్లోని 10 కి.మీ రేడియస్ లో 111 జీవో అమలు అవుతుంది. ఇందులోకి 84 గ్రామాలు వస్తాయి. ఈ గ్రామాల పరిధిలో 1,32,600 ఎకరాలు కేవలం వ్యవసాయం, వినోద జోన్లుగా మాత్రమే వినియోగించే పరిస్థితి నెలకొంది.
అక్కడ అభివృద్ధి ఆమడ దూరం..
ఈ జీవో కారణంగా మొయినాబాద్, శంషాబాద్, శంకర్ పల్లి, చేవెళ్ల, గండిపేట్, షాబాద్ మండలాల్లోని 84 గ్రామాల్లో ఇప్పటి వరకూ ఆంక్షలు కొనసాగేవి. నైరుతిలో ఆయా గ్రామాలు అభివృద్ధికి నోచుకోలేదు. నగరం చుట్టూ వేగంగా అభివృద్ధి జరుగుతున్నా. ఈ గ్రామలు మాత్రం వెనబడే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, పారిశ్రామి సంస్థలు రాకపోవడంతో నగరం విస్తరణ ఒక వైపునకు ఆగిపోయింది. ఈ ప్రాంతాల్లో భూముల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి.
జంట జలాశయాల నుంచి నగరానికి రోజుకు40 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా అవుతుంది. ఉస్మాన్ సాగర్ నుంచి 15 ఎంజీడీలు, హిమాయత్ సాగర్ నుంచి 22 ఎంజీడీలు సరఫరా అయ్యేవి. గతంలో ఈ జలాశయాల నుంచి నీటి సరఫరా కాకుండా నగరం అల్లాడి పోయేది. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నగరానికి కొన్నేళ్ల పాటు నీటి కష్టాలు రాకుండా చేశారు. కృష్ణా నది నుంచి 3 దశల్లో ప్రతీ రోజూ 270 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలించేందుకు సుంకిశాల పథకాన్ని పూర్తి చేశారు. తాగునీటి పథకం ద్వారా గోదావరి నుంచి ప్రతి రోజూ 170 మిలియన్ గ్యాలన్ల జలాలను తీసుకువస్తున్నారు.
సింగూరు-మంజీరా నుండి రోజుకు 93 మిలియన్ గ్యాలన్లు ఇలా జంట జలాశయాల నుంచి కాకుండా నగరానికి 533 మిలియన్ గ్యాలన్ల ప్రతీరోజు తాగునీరు అందుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కొండపోచమ్మ సాగర్ నుంచి కేశవాపురం వద్ద భారీ రిజర్వాయర్ నిర్మించనున్నారు. దీంతో అటు కృష్ణా, ఇటు గోదావరి నుంచి పుష్కలమైన నీటి లభ్యత ఉండడంతో సీఎం చెప్పినట్లుగా వందేండ్లకు కూడా హైదరాబాద్ తాగునీటి వ్యవస్థకు ఢోకా లేకుండా పోయింది.