Bandi Sanjay : తెలంగాణలో కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై తీవ్రంగా చర్చ కొనసాగుతోంది. బండి సంజయ్ ఇప్పటి వరకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారు. ఆయన సారధ్యంలో ఎన్నికలకు వెళ్తే ఘోర పరాభావం తప్పదంటూ రాష్ట్ర నేతలు అధిష్టానం వద్ద రోధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అధినాయకత్వం కూడా దీనిపై స్పందించింది. బండిని మార్చేది లేదని, ఆయన హయాంలోనే ఎన్నికలను ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కొంత మంది నేతలు బీజేపీని వదిలి కాంగ్రెస్ బాట పడుతున్నారు.
బండి సంజయ్ రాబోయే ఎన్నికలకు సారధ్యం వహిస్తారా? అనే అనుమానం మరోసారి కలుగుతోంది. ఇక్కడ బండి లాగే ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజు వీరంతా పార్టీని ముందుకు నడపడంలో వెనుకబడుతున్నారని పార్టీ స్థానిక నాయకులు అధిష్టానం వద్ద మొర పెట్టుకుంటున్నారు. అయితే వచ్చే నెల 3న (జూలై 3వ తేదీ) ఈ పుకార్లకు తెరపడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ రోజున బీజేపీకి సంబంధించి కీలకమైన మీటింగ్ ఉండడంతో ఇందులోనే వారు సరైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికలతో పాటు, ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలో స్ట్రాటజీపై పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రధాని మోడీతో సమావేశం జరగనుంది. ఇందులో పార్టీలోని మంత్రి వర్గంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. దీనితో పాటు ‘కామన్ సివిల్ కోడ్’ బిల్లును పార్లమెంట్ సమావేశంలో ఎలా పాస్ చేయాలో ప్రణాళికలు వేయనున్నారు. దీంతో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు వెళ్తున్న బీజేపీ స్ట్రాటజీని కూడా చెప్పనున్నారు. దీంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులపై అక్కడే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
దాదాపు బండి సంజయ్ ను పక్కన పెట్టకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు ఇంకా పట్టుమని ఆరు నెలలు కూడా లేవు. ఇప్పుడు అధ్యక్షుడి మార్పుతో పార్టీ మరింత దెబ్బతింటుందని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈటల, కొండా లాంటి వారికి మరిన్ని అధికారాలు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని సూచిస్తారని చెప్పకనే తెలుస్తోంది.
ReplyForward
|