Movie with Buchi Babu : సినిమాల ఎంపికలో రాంచరణ్ స్పీడు పెంచాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఈ సినిమా శంకర్ సినమా కంటే ముందే పట్టాలెక్కాల్సి ఉండగా కథలో కొంత మార్పులు చేర్పులు కావాలని రాంచరణ్ సూచించడంతో కథ సిద్ధం కావడానికి ఆలస్యం అయింది.
ఆగస్టులో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని డిసెంబర్ లేదా జనవరిలో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లాలని భావిస్తున్నారు. రాంచరణ్ కు కూతురు పుట్టడంతో జోష్ మీద ఉన్నాడు. కథల విషయంలో కూడా వేగం పెంచి సినిమాలు పూర్తి చేయాలని ఆలోచనలో ఉన్నాడు. ఇందులో భాగంగానే సినిమాల కథలు వింటూ కాలానుగుణంగా మార్పులు చేయాలని చూస్తున్నాడు.
శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న గేమ్ చేంజర్ కూడా పూర్తి కావాల్సి వచ్చింది. శంకర్ ఇదివరకే భారతీయుడు 2 సినిమాలో బిజీగా ఉండటంతో గేమ్ చేంజర్ ఆలస్యం అయింది. దీంతో సినిమాల వేగం పెంచుతున్నాడు. బుచ్చిబాబుతో చేయబోయే సినిమాలో ఏఆర్ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు.
హీరోయిన్ విషయంలో దీపికా పదుకునే అనుకుంటున్నారు. కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. సినిమాను 2025 లో విడుదలచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో సినిమా ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఇలా బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమా వెరైటీ కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు.
ReplyForward
|