YCP VS JAnasena : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంతకాలంగా వైసీపీ నేతలను, ఏపీ సీఎం జగన్ ను తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. వైసీపీ విముక్త ఏపీ, వైసీపీ విముక్త గోదావరి జిల్లాలు, వైసీపీ విముక్త విశాఖ,లాంటి వ్యాఖ్యలు చేస్తూ ఏపీలో ఎన్నికల వేడి పెంచుతున్నారు. ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు, సీఎం చేసిన అవినీతి చిట్టా తన వద్ద ఉందని కేంద్రానికి అందించబోతున్నానని ఇటీవల వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవడానికి అసలు కారణమే జగన్ అని, వారి దోపిడి వల్ల వారి అరాచకాల వల్లనే ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారని మండిపడ్డారు.
2024 ఎన్నికల్లో జనసేన సహిత ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన తరచూ వైసీపీ నేతలపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు చేసిన అవినీతిని రానున్న రోజుల్లో బయటకు తీస్తామని వారందరికీ గుణపాఠం నేర్పుతామని స్పష్టంగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిడీపీ వైసిపీ, జనసేన మధ్య ,సీరియస్ వారు నడుస్తున్నది జనసేన టీడీపీ వేరువేరుగా వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. రానున్న రోజుల్లో వైసీపీనీ దెబ్బతీసే ఆలోచనలతో పక్కా వ్యూహం ప్రకారం ఆ రెండు పార్టీలు ముందుకెళ్తున్నాయి. వైసీపీని రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రానివ్వనని పవన్ కళ్యాణ్ గట్టిగా చెబుతున్నారు. అయితే వైసిపి నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ దూషణలకు దిగడంతో ఆయన ఫ్యాన్స్ కూడా వైసీపీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలకు మరో తొమ్మిది నెలల గడువు మిగిలి ఉండగానే ఏపీలో ప్రస్తుతం వాతావరణం వేడెక్కింది.
రామన్న రోజుల్లో ఏపీలో పట్టు నిలుపుకోవడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు తో పొత్తు అంటూనే తన ప్లాన్ కు అనుకూలంగా ముందుకు వెళ్తున్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో తామే ప్రత్యామ్నాయం అనిపించేలా పవన్ కళ్యాణ్ రాటు దేలుతున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో జనసేన, టీడీపీ, వైసీపీ మధ్య పోటా పోటీ బల ప్రదర్శనలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే ఆయా పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ఏదేమైనా రానున్న ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీల అధినేతలు తమదైన ప్రణాళికలతో సిద్ధమవుతున్నారు.