29.3 C
India
Tuesday, February 10, 2026
More

    IPL 2023 final match : ఫైనల్ ఈ రోజూ వర్షార్పణమేనా!

    Date:

    IPL 2023 final match
    IPL 2023 final match

    IPL 2023 final match : రసవత్తరంగా సాగిన ఐపీఎల్ 16 సీజన్ తుది అంకానికి  చేరుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. గుజరాత్ లోని అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో రిజర్వుడేగా ఈరోజు మ్యాచ్ నిర్వహించేందుకు నిర్ణయించారు .

    అయితే వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం సోమవారం కూడా అహ్మదాబాద్ లో భారీ వర్షం పడే సూచనలు ఉన్నాయి. దీంతో ఈరోజు కూడా మ్యాచ్ జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అంతా భావిస్తున్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం మ్యాచ్ నిర్వహించేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నారు. వీలైతే 15, 10, 5 ఓవర్లైన నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కూడా కుదరకపోతే సూపర్ ఓవర్ ద్వారా  విజేతను నిర్ణయిస్తారు. లేదంటే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఇలాగే చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ అత్యధిక పాయింట్లతో ముందంజలో ఉంది. దీంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 16 సీజన్ విజేతగా నిలవనుంది. వరుసగా ఇది విజేతగా రెండోసారి కానుంది.

    మ్యాచ్ జరగకపోతే అభిమానుల కు నిరాశ మిగులనుంది. ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా జరుగుతుంది అని స్టేడియానికి చేరుకున్న అభిమానులకు వర్షం సహకరిస్తుందో లేదో మరి కొన్ని గంటల్లోనే తేలనుంది. మరోవైపు వరుణుడు శాంతించాలని క్రికెట్ అభిమానులు ప్రార్థిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లలో  మరి విజేతను  నిర్ణయించేది వర్ణుడా లేదంటే మ్యాచా మరి కొన్ని గంటల్లోనే తేలనుంది. ఇక నరేంద్ర మోడీ స్టేడియంలో వర్షం కురుస్తుందా.. బ్యాట్స్మెన్ దాటికి పరుగుల తుఫాన్ కురుస్తుందా చూద్దాం.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    CSK Champion : చెన్నైనే చాంపియన్.. మహి మార్కు స్కెచ్..

    CSK Champion : ఐపీఎల్ 16 సీజన్ విజేతగా చెన్నై సూపర్...

    Sajjanar : ఐపీఎల్ యాజమాన్యానికి సజ్జనార్ సూటి ప్రశ్న

    Sajjanar : ప్రస్తుతం ఐపీఎల్ సమరం నడుస్తోంది. పలు సంస్థలు ఇందులో...

    CSK Opener : ఐపీఎల్ లో మరో రికార్డ్ .. ఈసారీ సీఎస్కే ఓపెనర్లే..

    CSK opener : ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం...