AP : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార పార్టీతో పాటు విపక్షాలు తమ తమ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి మంత్రులు, ఎంపీలు, పదేపేద చెప్పే మాట ఎన్నికల్లో మాకు ఎవరితోనూ పొత్తు అవసరం లేదు. ఒంటరిగానే పోటీ చేస్తాం విజయం సాధిస్తామని చెబతుంటారు. 2014, 2019 ఎన్నికల్లోనూ జగన్ ఇదే మాట చెప్పాడు. ప్రజల్లో మాపై నమ్మకం ఉంది. గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుగా కుదుర్చుకోగా వైసీపీ ఓటమి పాలైంది. కానీ 2019 లో బీజేపీ, జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల్లో జగన్ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు.
2024 ఎన్నికలకు వచ్చే సరికి ఇప్పటికే జనసేన, బీజేపీ అలయన్స్ ఉన్నాయి. అయితే ఎన్నికల వరకు జనసేన టీడీపీతో కలిసి అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అదే సమయంలో పవన్ కూడా పలు సార్లు చెప్పారు. వ్యతిరేకత ఓటును చీలనివ్వము అని స్పష్టం చేశారు. పొత్తు ఉన్నా అది తమకు ఉపయోగపడితేనే అని చెప్పారు.
మారుతున్న పరిణామాలు..
అయితే ఇటీవల పరిణామాలు చూసుకుంటే వైసీపీకి కొంత ఎదురుగాలి వీస్తు్న్నది
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. కుప్పంతో సహా వై నాట్ 175 అన్న నినాదం అధికార పార్టీది అయితే, టీటీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో గెలుస్తాడా అన్న అనుమానంతో ప్రతిపక్ష దుస్థితి. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం పరిధిలోని రెండు స్థానాల్లో టీడీపీ అనూహ్యంగా విజయం సాధించింది. దీంతో వైసీపీలోనూ కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తనను అమితంగా ఇష్టపడే శ్రేణులు, వివిధ తరగతి వారే తనకు దూరమవుతుండడం జగన్ కు కొంత నిరాశే. అయితే తను బలహీన పడుతున్నాడా, లేక ప్రజలు దూరమవుతున్నారా విషయాన్ని జగన్ పునరాలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
రాష్ట్రంలో జనసేన పార్టీకి 14%, టీడీపీకి దాదాపు 34% ఓట్లు వస్తాయి. టీడీపీ, జనసేన కూటమిలో చేరి, కలిసి ప్రచారం చేస్తే 40% ఓట్లు మాత్రమే వస్తాయి. అయితే YSRCP తన 46% ఓట్ షేర్‌ను కలిగి ఉంటుంది. మచిలీపట్నం, ఏలూరు, నర్సాపురం, అమలాపురం, కాకినాడ పార్లమెంటు జిల్లాల్లో జనసేన మెరుగ్గా పనిచేస్తుందని, 32% ఓట్లను పొందుతుందని ఇటీవల ఓ సర్వే సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది .
కాగా ఇప్పుడున్న పరిస్థితులు రానున్న రోజుల్లో ఉండకపోవచ్చు. అధికార పార్టీ మరింత బలహీన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.