J. D. Chakravarthy అప్పుడెప్పుడో 70 MM తో కనిపించిన జేడీ ఛక్రవర్తి తర్వాత ‘దయా’తో మళ్లీ తన అభిమానులను పలకరించాడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత నుంచి జేడీ ఛక్రవర్తి బ్లాక్ బస్టర్ సినిమాలు తీశాడు. హీరోగా స్టార్ డమ్ రాకున్నా ఆయన తీసిన ప్రతీ చిత్రం అద్భుతమనే చెప్పాలి. హర్రర్, సస్పెన్స్, కామెడీ, మర్దర్, ఇలా ఏ జానర్ ను కూడా ఆయన వదలలేదు. ఇక కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన, దర్శకుడిగా కూడా కొన్నింటికి వ్యవహరించారు. ఇక అవన్నీ పక్కన పెట్టి వెబ్ సిరీస్ లలో కనిపిస్తున్నాడు. ఆయన ఇటీవల ‘దయా’ తీస్తే. దీనికి ముందు ‘తాజా ఖబర్’లో కూడా చేశాడు.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో రిలీజైన ‘దయా’ వెబ్ సీజన్ 1లో 8 ఎపీసోడ్స్ వచ్చాయి. ప్రతీ ఎపీసోడ్ సస్పెన్స్ ను తలపిస్తుంది. ప్రస్తుతం ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తున్న సిరీస్ ఇది. ఈ సిరీస్ కు సంబంధించి ప్రేక్షకులకు చాలా అనుమానాలు ఉన్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు సీజన్ 2 కూడా వస్తుందని ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. జేడీ సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఈ మధ్యే ఓటీటీ కంటెంట్ లోకి అడుగు పెట్టారు.
బెంగాలీ వెబ్ సిరీస్ ‘తక్దీర్’ కథ ఆధారంగా ‘దయా’ తెరకెక్కించారు. ఇందులో ఆయన పాత్ర పేరు దయా ఈయన చుట్టే కథ తిరుగుతుంది. ట్రైలర్ తోనే ఆకట్టకున్నారు మేకర్స్. ప్రమోషన్లు కూడా ఎక్కువగా నిర్వహించడంతో ఈ సిరీస్ కు బజ్ వచ్చింది. పవన్ సాదినేని దయా సిరీస్ కు దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు మరో 6 భాషల్లో సీజన్ 1 స్ట్రీమింగ్‍కు వచ్చింది. దాదాపు 3 గంటలకు పైగా ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
వెబ్ సిరీస్ లో ఈషా రెబ్బా, రమ్యా నంబీషన్, రవి, జోష్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, కమల్ కామరాజు నటించారు. శ్రవణ్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోనీ నిర్మాతలుగా వ్యవహరించారు. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన దయా. కొన్ని అనుమానులను సైతం మోసుకచ్చింది. కొన్నింటికి క్లారిటీ ఇవ్వలేదని కామెంట్స్ వచ్చాయి.
అయితే వీటిపై క్లారిటీ ఇచ్చేందుకు సీజన్ 2 వస్తుందని మేకర్స్ చెప్తున్నారు. దర్శకుడు పవన్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పారు. త్వరలో సీజన్ 2 ఉంటుందని దీనికి సంబంధించిన షూటింగ్ కూడా జరిగిందన్నారు. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో స్ట్రీమింగ్ కు తెస్తామని తెలిపారు.
సీజన్ 1లోని అన్ని అనుమానాలను 2 క్లారిఫై చేస్తుందని తెలిపారు. సీజన్ 2లో కూడా జేడీ చక్రవర్తే ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సీజన్ 1 ఇంతటి వ్యూవ్స్ తో దూసుకుపోతుంటే సీజన్ 2 ఎలా ఉండబోతుందో మీ ఊహకలకే వదిలేస్తున్నాను అన్నారు.