Minister lifestyle : ఒకప్పుడు గొప్ప ప్రజా ప్రతినిధులు ఉండేవారు. టంగుటూరి ప్రకాశం వంటి గొప్ప మహనీయుడు తన చొక్కా చిరిగిందని కవర్ చేసుకునేందుకు ఆయనకు బహూకరించిన శాలువాలు కప్పుకునేవాడు. అలాంటి ప్రజా ప్రతినిధుల కనుమరుగయ్యారు. ఇప్పుడు గ్రామాలకు గ్రామలు కొళ్లగొట్టే.. ఊర్లకు ఊర్లు అమ్ముకునే ప్రజా ప్రతినిధులు మోపయ్యారు. కానీ ఎక్కడో ఒక చోట అవినీతి సొమ్ము ముట్టుకోని వారు కూడా ఉన్నారు.
ఏపీకి చెందిన మహిళా శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం జిల్లా, సాలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాజన్నదొరపై 13,733 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ కోసం మొదటి నుంచి నిబద్ధతగా వ్యవహరించిన ఆమెకు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. ఆమెకు ఆడంబరాలు అంటే నచ్చవు. చాలా సింపుల్ గా ఉంటుంది. మంత్రి అయిన తర్వాత సొంత కారు కొనుక్కోవాలని అనుకున్నారు. దీని కోసం లోను పెట్టుకున్నారట.
30 వాయిదాల్లో..
కారు కొనుగోలు చేసేందుకు రుణం తీసుకున్నారు. మంత్రులు ప్రభుత్వం నుంచి రుణం తీసుకునేందుకు వెసులుబాటు ఉంది. వారికి ఇచ్చే వేతనంలో ప్రతీ నెలా కటింగ్ ఉంటుంది. కారు కొనుగోలు కోసం మంత్రికి ప్రభుత్వం రూ.20 లక్షల రుణం ఇచ్చింది. ఈ మొత్తాన్ని ఆమె 30 వాయిదాల్లో చెల్లించనుంది. మంత్రి అయిన ఆమె రుణం తీసుకోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.
1999లో కాంగ్రెస్ పార్టీ నుంచి సంధ్యారాణి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి ఎన్నికల్లో సాలూరు నుంచి పోటీచేసిన ఆమె టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమిపాలయ్యారు. 2006 వరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు.
రాజన్నదొరపై విజయంతో..
ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా 2007 – 2009 వరకు పని చేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరారు. 2009లో సాలూరు నుంచి టీడీపీ తరఫున పోటీచేసి రాజన్న దొర చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి అరకు ఎంపీ స్థానానికి పోటీచేసి ఓటమిపాలయ్యారు. 2024లో రాజన్నదొరపై విజయం సాధించి మంత్రి పదవి చేపట్టారు. 2015 నుంచి 2021 వరకు టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.