
Las Vegas : ప్రపంచంలోనే అత్యద్భుతం నిర్మాణం ఒకటి యూఎస్ లోని లాస్ వెగాస్ లో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గోళాకారంలో నిర్మించిన ఈ భవనం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నది. దీని పేరు ఎంఎస్జీ స్పియర్. దీని కోసం 2.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. మొత్తంగా నాలుగేళ్లు ఈ భవనం నిర్మాణానికి పట్టింది. ఈ బాల్ ఆకారంలో ఉన్న నిర్మాణం పూర్తిగా వినోదాలకు మాత్రమే ఉపయోగపడుతుంది. MSG స్పియర్ ది వరల్డ్స్ లార్జెస్ట్ LED స్క్రీన్ 4 జూలై 2023న లాస్ వెగాస్‌లో 1వ సారి వెలిగింది. వెనీషియన్ రిసార్ట్‌లోని కొత్త $2.3 బిలియన్ల ఎంటర్‌టైన్‌మెంట్ వెన్యూలో అన్ని అద్భుతమైన విజువల్స్ చూడడం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అధికారికంగా MSG స్పియర్‌ను సెప్టెంబర్ 29, 2023న తెరి చేందుకు సిద్ధమవుతున్నారు.
అయితే ఇందులో మరికొన్ని ఇవెంట్లు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అవార్డుల ఉత్సవాలు, ఇతర వేడుకలకు ఇది ఉపయోగపడనుంది. 112 మీటర్లఎత్తులో 30 ఫ్లోర్లతో ఈ బిల్డింగ్ ఉంటుంది. అత్యాధునిక స్క్రీన్లు ఇందులో ఉన్నాయి. రాత్రిపూట నగరం అవతలి నుంచి కూడా ఈ బిల్డింగ్ వెలుగులను తిలకించివచ్చు. 16కే రెజల్యూషన్ తెరలు ఇందులో ఉన్నాయి. ఈ భవనం రెండు సాకర్ మైదానాలను విస్తరించినట్లుగా ఉంటుంది. 164000 స్పీకర్ సౌండ్ సిస్టంలు ఇందులో ఉన్నాయి.
ఇందులో ఉన్న అత్యాధునిక సదుపాయాలు మరే నిర్మాణంలో లేవు. వైబ్రేషన్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంటుంది. తెరపై వచ్చే చిత్రానికి అనుగుణంగా ఈ తెర స్పందిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ 29న దీనిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 18వేల సీట్లు ఈవెంట్ల నిర్వహణకు అందుబాటులో ఉంచారు.