
Brilliant Idea : సినిమా అనేది కొందరి కళ. ఎక్కడున్నా.. ఎక్కడికి వెళ్లినా.. మూవీకి డైరెక్షన్ చేయాలనో.. లేదంటే మూవీలో నటించాలనో కొందరు కోరుకుంటారు. పరిస్థితులు కలిసి వస్తే ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తారు. అలాంటి ఒక భారతీయుడు న్యూ జెర్సీలో మూవీని చేయబోతున్నాడు. ఈ విషయం ప్రతీ ఇండియన్ కు గర్వకారణమనే చెప్పాలి.
దర్శకుడు రబిందర్ పరాషార్ అమెరికాలోని న్యూ జెర్సీలో ప్రవాసుడిగా ఉన్నాడు. అక్కడున్న లోకల్ టాలెంట్ యాక్టర్స్ తో ఒక సినిమా చేయాలకున్నాడు. అందుకు కథను సిద్ధం చేసుకున్నాడు. ఆ సినిమాకు టైటిల్ ‘బ్రిలియంట్ ఐడియా’ అని ఖరారు చేశాడు. నటీ నటుల ఎంపిక ఇటీవల పూర్తి కావడంతో మూవీ షూటింగ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు.
జూలై 30వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరించాడు. లోకల్ గా ఉన్న రికీ, జేఎస్ కింగ్ తో పాటు ప్రవాసులైన రాజేశ్ పరాషార్, చందర్ మోహన్ తో పాటు 20-30 మంది లోకల్ టాలెంట్ యాక్టర్స్ ను తీసుకున్నాడు. ఈ మూవీని హిందీ, ఇంగ్లిష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.
స్టోరీ లైన్: ఇద్దరు రెస్టారెంట్ ఓనర్లు వారిద్దరూ శివుడి భక్తులు.. ఒక రెస్టారెంట్ ఓనర్ కు అంతా కలిసి వస్తుంది. మరో రెస్టారెంట్ ఓనర్ సక్సెస్ కాలేకపోతాడు. అతనే ఎందుకు సక్సెస్ అయ్యాడని పరమ శివుడిని ప్రశ్నిస్తాడు మరో ఓనర్. ఈ నేపథ్యంలో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది.
ఇది పూర్తి స్థాయి కామెడీ మూవీ. కొవిడ్ సమయంలో ఏం చేయాలో తెలియక కామెడీ రూపకంగా సినిమా అందించాలని స్టోరీ, స్ర్కీన్ ప్లే రాసుకొని ఇన్నాళ్లకు దాన్ని సినిమాగా మలుస్తున్నాడు.
దర్శకుడి గురించి..
‘బ్రిలియంట్ ఐడియా’ డైరెక్టర్ రబిందర్ పరాషార్ గతంలో బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆయనతో కలిసి ఏడు నుంచి ఎనిమిది సినిమాలకు అసిస్టెంట్ బాధ్యతలు నిర్వర్తించాడు. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడ్డాడు.
నటుడు రికీ కూడా నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరిస్తున్నారు. రికీ న్యూ జెర్సీలో పూజా రెస్టారెంట్ యజమాని. రబిందర్ ఆయనకు కథ వినిపించిన వెంటనే ప్రొడ్యూసర్ బాధ్యతలు కూడా తీసుకుంటానని రికీ చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ ముకేష్ ఖాశీవాలా, డా.శివకుమార్ ఆనంద్ గారు నిర్వహిస్తున్నారు.