
Sarath Babu Hero : వెటరన్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన విషయం తెలిసిందే.. ఈయన 71 సంవత్సరాల వయసులో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.. శరత్ బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.. 1974లో రామరాజ్యం అనే సినిమాలో హీరోగా పరిచయం అయ్యాడు.. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా చేసి ఆడియెన్స్ ను అలరించిన శరత్ బాబుచాడు..
అయితే ఈయన మరణించిన తర్వాత ఆయన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. ఈయన చిన్న చిన్న పాత్రలతో కేరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోగా కూడా ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే ఈయన స్టార్ హీరో మాత్రం అవ్వలేక పోయారు.. ఎన్నో సినిమాల్లో నటించిన కూడా ఈయన మాములుగా హీరోగా మాత్రమే రాణించాడు..
అయితే శరత్ బాబు హీరోగా, మెగాస్టార్ చిరంజీవి విలన్ గా ఒక సినిమాలో పని చేసిన విషయం చాలా మందికి తెలియదు.. చిరంజీవి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చే సమయానికే శరత్ బాబు హీరోగా సినిమాలు చేస్తున్నారు.. మరి చిరు ఎంట్రీ ఇచ్చిన కొత్తలో సైడ్ పాత్రలు, విలన్ క్యారెక్టర్స్ చేసి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే..
కె బాలచందర్ డైరెక్షన్ లో వచ్చిన 47 రోజులు సినిమాలో శరత్ బాబు హీరోగా చేస్తే ఇందులో విలన్ గా చిరంజీవి నటించారు.. జయప్రద హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.. తమిళ్ లో కూడా సూపర్ హిట్ అయిన ఈ సినిమా శరత్ బాబుకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది..