
Chian Vikram : ఏ సినీ పరిశ్రమలో అయిన సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన స్టార్స్ ఉన్నారు.. అలాంటి వారిలో ఇప్పుడు స్టార్ హీరోలుగా రాణిస్తున్న హీరోలు ఎందరో.. మరి అలాంటి అరుదైన కథానాయకుల్లో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఒకరు.. విక్రమ్ నటించిన ఎన్నో సినిమాలు డబ్బింగ్ ద్వారా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్నాయి.. వాటిల్లో హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి..
అయితే విక్రమ్ స్టార్ హీరోగా మారక ముందు ఈయన డైరెక్ట్ తెలుగు సినిమాల్లో కూడా నటించారని మీకు తెలుసా.. ఈయన ఎన్నో తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసారు.. చెల్లి కాపురం, అక్క పెత్తనం, చిరునవ్వుల వరం, బంగారు కుటుంబం వంటి ఎన్నో తెలుగు సినిమాల్లో ఈయన నటించారు.. మరి అందులో బంగారు కుటుంబం బ్లాక్ బస్టర్ అయ్యింది.
ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో నటించారు.. ఈ సినిమా ఈయనకు మంచి గుర్తింపు తెచ్చింది.. ఈ సినిమా మినహా మిగతా సినిమాల వల్ల విక్రమ్ కు ఆశించిన విజయం అయితే దక్కలేదు.. విక్రమ్ తెలుగులో హీరోయిన్ ఊహతో ఎక్కువ సినిమాలు చేసారు. వీరి కాంబోలో వచ్చిన ఊహ సినిమాలో విక్రమ్ నెగిటివ్ రోల్ లో నటించారు.
ఇక ఈ సినిమాలో కమెడియన్ అలీ హీరోగా చేసారు.. ఈ సినిమా తర్వాత విక్రమ్ మరొక నెగిటివ్ రోల్ చేయలేదు సరికదా పూర్తిగా తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోయి అక్కడే సినిమాలు చేయడం స్టార్ట్ చేసారు.. ఈ క్రమంలోనే శివపుత్రుడు, అపరిచితుడు వంటి సినిమాలతో సూపర్ స్టార్ గా ఎదిగారు.. ఇక అప్పటి నుండి ఈయన అక్కడే సెటిల్ అయ్యి తమిళ్ లోనే సినిమాలు చేస్తున్నాడు.