
National Highways : రవాణా వ్యవస్థ సరిగా ఉంటే దేశం డెవలప్ అవుతుందని ప్రధాని మోడీ మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. అందుకే ఆయన ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తూ రోడ్ వేస్ ను పెంచుతున్నారు. దీనితో పాటు రైల్ ట్రాక్ ను పెంచారు. దీంతో గూడ్స్ ఎటువంటి ఇబ్బంది లేకుండా రన్ అవుతుంటుంది.
మోడీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి జాతీయ రహదారుల పొడవు 60 శాతం పెరిగింది. 2014లో 91,287 కిలో మీటర్లు ఉన్న నేషనల్ హైవేస్ డిసెంబర్, 2023 నాటికి 1,46,145 కిలో మీటర్లకు చేరింది. రోడ్డు రవాణా, జాతీయ రహదారుల కార్యదర్శి అనురాగ్ జైన్ ఈ విషయాలను మీడియాకు వివరించారు. డిసెంబర్ వరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) టోల్ రూపంలో రూ.18,450 కోట్లు కలెక్ట్ చేసినట్లు చెప్పారు.
* నాలుగు, అంతకంటే ఎక్కువ లైన్లు ఉన్న జాతీయ రహదారుల పొడవు 2014లో 18,387 కిలో మీటర్ల నుంచి 2023, డిసెంబర్ నాటికి రెండున్నర రెట్లు పెరిగి 46,179 కిలో మీటర్లకు పెరిగింది.
* హై-స్పీడ్ కారిడార్ల పొడవు 2014లో 353 కిలో మీటర్లు కాగా, 2023 నాటికి 3,913 కిలో మీటర్లకు పెరిగింది.
* టూ లేన్ల కంటే తక్కువ ఉన్న హైవేల పొడవు 10 శాతానికి తగ్గింది.
* ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 13,814 కిలో మీటర్ల మేర కొత్త హైవేలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా.. డిసెంబర్ వరకు 6,217 కిలో మీటర్లు పూర్తి చేశారు.
* 2014 నుంచి 2023 నాటికి శాఖ ఆధ్వర్యంలో రహదారుల నిర్మాణ వ్యయం 9.4 రేట్లు పెరిగి రూ.3.17 లక్షల కోట్లకు చేరిందని అంచానా.
* వాహనాల తుక్కు చసేందుకు దేశంలో 44 స్క్రాపింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 49,770 వాహనాలను తుక్కుగా మార్చారు.