Crime News సోషల్ మీడియా విపరీతంగా పెరుగుతుండడం కొందరికి వరం అయితే మరికొందరికి శాపంగా మారింది. సంప్రదాయం ముసుగులో అమ్మాయిల కాళ్లకు సంకెళ్లు వేస్తుంటే ఈ సోషల్ మీడియా దయవల్ల రీల్స్ రూపంలో వారు బయటకు వస్తున్నారు. దీన్ని కూడా సహించని కొందరు అమ్మాయిలను చంపుతున్నారు. ఇలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెంలో జరిగింది. ఆ రీల్స్ చేస్తుందని యువతిని రోకలి బండంతో కొట్టి చంపాడు అన్న.
భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు మండలం, రాజీవ్ నగర్ కు చెందిన అజ్మీర సింధు మహబూబాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుంది. ఉద్యోగం చేస్తూనే అప్పుడప్పుడు సోషల్ మీడియాలోని తన ఖాతాలో రీల్స్ చేస్తుంటుంది. దీని ద్వారా కూడా కొంత సంపాదిస్తుంది. కానీ ఆమె డబ్బు సంపాదన కోసం కాకుండా తనకు ఇష్టమని రీల్స్ చేస్తుండేది. లవ్, ప్రేయసీ, ప్రియుడు ఈ కోణంలోనే రీల్స్ చేస్తుంటుంది.
ఇలాంటి రీల్స్ పోస్ట్ చేయవద్దని తన అన్న హరిలాల్ మొదటి నుంచి చెప్తున్నాడు. కానీ ఆమె మాత్రం వినలేదు. రీల్స్ చేస్తూనే ఉంది. ఆగ్రహంతో ఊగిపోయిన హరిలాల్ రోకలి బండతో ఆమెపై దాడి చేశాడు. తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అయితే, దీనిపై నెటిజన్లు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకోవాలని కొందరు కోరితే.. ఆమె ఆ రీల్స్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు సూచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా కూర్చొని మాట్లానుకుంటే సరిపోయేదానికి చంపడం కరెక్ట్ కాదంటున్నారు.
ఈ రీల్స్ వీడియోస్ చేసినందుకే చెల్లెని రోకలి బండతో కొట్టి చంపిన అన్న. https://t.co/JcboymFg5r pic.twitter.com/d3xtiTMRXu
— Telugu Scribe (@TeluguScribe) July 26, 2023