26.3 C
India
Wednesday, September 16, 2026
More

    Jaswant Gar : 300 మంది చైనీయులను చంపిన ఒకే ఒక్కడు.. జస్వంత్ గార్..!

    Date:

    Jaswant Gar
    Jaswant Gar

    Jaswant Gar : రైఫిల్‌ మ్యాన్ జస్వంత్ సింగ్ గార్ రావత్ ధైర్య సాహసాలకు కేరాఫ్ అని చెప్పచ్చు. భారత దేశానికి స్వాతంత్య్రం సిద్దించాక మన దేశ గర్వాల్ రైఫిల్స్‌లో పని చేసిన సైనికుల్లో జస్వంత్ సింగ్ ఒకరు. అరుణాచల్‌లోని నురానాంగ్ యుద్ధంలో జస్వంత్ చర్యల ఫలితంగా మరణానంతరం ఆయనకు ప్రతిష్టాత్మక మహావీర్ చక్ర దక్కింది.

    చైనా-భారత యుద్ధం సమయంలో జస్వంత్ గార్ ధైర్య సాహసాలు ఇప్పటికీ భారత ఆర్మీని ఉత్తేజపరుస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో. రైఫిల్‌ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ నార్త్-ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ (ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్)లోని నురానాంగ్ వద్ద చైనాతో 1962 నవంబర్ 17న జరిగిన యుద్ధంలో 4వ బెటాలియన్ 4వ గర్హ్వాల్ రైఫిల్స్‌లో పని చేశాడు. నాడు 4వ గర్హ్వాల్ రైఫిల్స్ వారి స్థానంపై రెండు పీపుల్స్ లిబరేషన్ చైనా ఆర్మీ దాడులను తిప్పికొట్టాయి.

    మూడవ చొరబాటు సమయంలో చైనీస్ మీడియం మెషిన్ గన్ (MMG) భారత రక్షణ దళాలకు దగ్గరగా వచ్చి కాల్పులకు తెగబడింది. ఈ సమయంలో రైఫిల్‌మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్.. లాన్స్ నాయక్ త్రిలోక్ సింగ్ నేగి.. రైఫిల్‌ మ్యాన్ గోపాల్ సింగ్ గుసేన్‌లతో కలిసి MMGని అణచివేయడానికి స్వతహాగా ముందుకొచ్చారు.

    జస్వంత్ ఒక్కడే ఐదు సెంట్రీల చైనీస్ ఆర్మీని అడ్డుకోవడం గమనార్హం. ఏకంగా చైనీస్ MMG గన్ ని స్వాధీనం చేసుకొని తిరిగి వస్తుండగా చైనా ఆర్మీ దొంగదెబ్బ తీయడంతో జస్వంత్ వీరమరణం చెందారు. జస్వంత్ ఒక్కడి పోరాటం వల్ల ఆ యుద్ధంలో 300 మంది చైనీయులు ప్రాణాలను కోల్పోయారు. కాగా 4వ గర్వాల్ రైఫిల్స్ ఇద్దరు వ్యక్తులను కోల్పోగా 8 మంది గాయపడ్డారు. జస్వంత్ సాహసాలను గుర్తించిన భారత ఆర్మీ ఆయన మరణానంతరం ప్రతిష్టాత్మక మహావీర్ చక్రతో సత్కరించింది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chinese army : యుద్ధానికి సిద్ధం కావాలని చైనా సైన్యానికి జిన్‌పింగ్‌ సూచన

    Chinese army Chinese army : చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన...

    The Largest Army : అత్యధిక సైన్యమున్న దేశాలు ఇవే తెలుసా..?

    The Largest Army : ఏదేశానికైనా సొంత సైన్యం ఉంటుంది. తమ...