
crow : మనుషుల కంటే పశుపక్ష్యాదులు నయం అని తరచూ మన పెద్దలు అంటుంటారు. జంతువుల్లో ఉన్న ఐక్యత మనషుల్లో ఉండదు అంటారు. పక్కోడు ఎప్పుడు పడిపోతాడా? అని మనలో చాలా మంది ఎదురుచూస్తుంటారు. ప్రతీ విషయంలోనూ పక్కోడిని చూసి పోల్చుకోవడమే..పక్కోడి కంటే ఎక్కువ సంపాదించాలి..పక్కోడి కంటే ఆనందంగా ఉండాలి.. ఇలా ఉంటుంది నేటి మనిషి మనస్తత్వం. ఇక రోడ్డుపై ఎవరినైనా చంపినా పట్టించుకోని సమాజం మనది. ఇతరులకు సాయం చేయడం అనేది మరిచిపోతున్న రోజులివి. మనిషిలో ఐక్యత, మానవత్వం, స్నేహపూరిత ఆలోచనలు కనుమరుగు అవుతున్నా రోజులివి..పశుపక్ష్యాదుల్లో మాత్రం ఇవి ఇప్పటికీ చెక్కుచెదరలేదు. అవి తమ ఉనికిని ఏమాత్రం కోల్పోలేదు. తాజాగా కాకుల్లో ఐక్యతకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన ప్రతీ ఒక్కరూ తమలో ఆ ఐక్యత లేనందుకు సిగ్గుపడుతున్నారు. ఇంతకీ ఆ ఘటన ఏంటి? ఎక్కడ జరిగింది? అదేంటో తెలుసుకుందాం..
ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలోని డైలీ మార్కెట్ లో పలు చికెన్ షాపులు ఉన్నాయి. ఓ చికెన్ షాపు వద్దకు ఓ కాకి రోజూ వస్తోంది. చికెన్ ముక్కలు ఎత్తుకెళ్తోంది. ఎన్నిసార్లు తరిమేసినా కూడా మళ్లీ మళ్లీ వస్తుండడంతో ఆ యజమానికి విసుగొచ్చింది. ఆ కాకిని షాపు దగ్గరకు రానిచ్చి.. చాకచక్యంగా పట్టుకున్నాడు. దాన్ని ఓ తాడుతో కట్టేశాడు. దాంతో కాకి అరువసాగింది. దీంతో ఆ అరుపులు విన్న వందలాది కాకులు ఆ షాపు వద్దకు చేరుకున్నాయి. ఆ చుట్టుపక్కలే ఎగురుతూ..పెద్దగా అరుస్తూ తమ మిత్రకాకి కోసం చికెన్ షాపుపై దండెత్తాయి.
చికెన్ షాపు చుట్టూ చేరిన కాకులు పెద్దగా అరుస్తుండడంతో ఆ చుట్టుపక్కల షాపుల వారికి విసుగొచ్చింది. అయినా కూడా ఆ షాపు యజమాని కాకిని వదల్లేదు. పైన కాకులు అరుపులు ఆపలేదు. చివరకు అక్కడికి వచ్చే కస్టమర్లకు ఏంట్రా బాబూ ఈ కాకి గోల అంటూ చికెన్ షాపు యజమానికి చెప్పారు. ఇలా తోటి దుకాణ దారులు, కష్టమర్లు చెప్పేసరికి ఆ కాకిని షాపు యజమాని వదిలేశాడు. దాంతో పాటు మిగతా కాకులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాకులకు ఉన్న ఐక్యత మనకు లేదంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. రోడ్డుపై మొన్నీ మధ్య ఓ వ్యక్తిని చంపుతుంటే అక్కడున్న వారు చోద్యం చూశారే తప్ప ఒక్కరూ వచ్చి కాపాడలేదు. కానీ ఒక్క కాకికి కష్టమొస్తే.. వందలాది కాకులు వచ్చి దాన్ని విడిపించుకుపోయాయి.. కాకులకున్న బుద్ధి కూడా మనకు లేదంటూ మనుషులను తిట్టిపోస్తుండడం గమనార్హం.
కాకి అరిచి విసిగిస్తుందని తాడుతో కట్టేసిన ఓ చికెన్ షాప్ యజమాని
అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాక డైలీ మార్కెట్లో ఒక కాకి అరిచి విసిగిస్తుందని దాన్ని ఓ చికెన్ షాప్ యజమాని తాడుతో కట్టేశాడు.. అయితే కాకిని బంధించడంతో అక్కడకు వందలాది కాకులు చేరుకుని అరవడం మొదలెట్టాయి.
కాకుల గోలను… pic.twitter.com/08GzAC94px
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2024