Tollywood Star Hero : పై ఫొటోలో ఉన్న కుర్రాడే టాలీవుడ్ లో టాప్ హిరోగా సెలెబ్రెటీగా మారిపోయాడు. సొంత ఇమేజ్ తో తన పేరును అందరికీ తెలిసేలా చేసుకున్నాడు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్న హిరో ఆయన. లవర్ బాయ్ పాత్రలు చేస్తూ తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. కొన్ని వివాదాల్లో కూడా కూడా చిక్కుకున్న చిన్నోడు ఈ టాప్ హిరో.
ముక్కుసూటిగా మాట్లాడే తత్వం. తనను విమర్శించే వారు ఎంతటి వారైనా సరే వారి పేరుతో సహా చెప్పేసే నైజం అతడి మనస్తత్వం. అయితే ఈ మధ్య అఘోరా సినిమాతో ఎంతో పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలపైనే కష్టపడ్డాడు. కొన్ని నెలల క్రితం విడుదలైన ఈ మూవీ.. లో యాక్టింగ్ అందరూ ఫిదా అయిపోయారు. ఇంతకీ ఆ టాలీవుడ్ యంగ్ హిరో విశ్వక్ సేన్.
విశ్వక్ సేన్ తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదారి సినిమాలో నటించాడు. విశ్వక్ సేన్ హిరోగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఫలక్ నుమా, దాస్ కా దమ్కీ చిత్రాల్లో హిరోగానే కాకుండా డైరెక్షన్ బాధ్యతలను కూడా తీసుకుని తనెంటో నిరూపించుకున్నాడు. గోదావరి నేపథ్యంలో సాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదారి ఈ మధ్యే రిలీజ్ అయి మంచి పేరు సంపాదించుకుంది. ఇందు నేహా శెట్టి హిరోయిన్ గా నటించింది. చైతన్య కృష్ణ డైరెక్షన్ చేశాడు. లంకల రత్నాకర్ అలియాస్ టైగర్ రత్న అనే పాత్రలో విశ్వక్ సేన్ నటించాడు. అయితే ఎప్పటికప్పుడు తన ప్రాజెక్టుల గురించి చెప్పే విశ్వక్ తన నుంచి రాబోయే మరో ప్రాజెక్టు డిటేయిల్స్ చెప్పడం లేదు.
విశ్వక్ సేన్ వివాదాలు కూడా ఆయన క్యారెక్టర్ పై కొంచెం నెగిటివిటీని తీసుకొచ్చిన ప్రస్తుతం అవేవీ ఆయనపై ప్రభావం చూపించడం లేదు. విశ్వక్ సేన్ టీవీ 9 దేవీతో, స్టార్ హిరో అర్జున్ తో వివాదం పెట్టుకుని తీవ్ర విమర్శలు మూట గట్టుకున్నారు.