29.1 C
India
Thursday, September 19, 2024
More

    The Power Congress : అధికారం అందేనా ? గెలుపు గుర్రాల కోసం కాంగ్రెస్ కసరత్తు

    Date:

    The Power Congress
    The Power Congress

    The Power Congress : ఎన్నో ఏళ్ల కలను సాకారం చేసిన కాంగ్రెస్ రెండు తెలుగు రాష్ర్టాల్లో అదికారం కోల్పోయింది. తెలంగాణలో పదేళ్లుగా ప్రతిపక్షంలో  ఉంటుండగా, ఏపీలో మాత్రం ఉనికిని చాటుకోవడానికి ఆపసోపాలు పడుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో 60 ఏళ్లు పాలన సాగించిన కాంగ్రెస్ అధికారం కోసం  తపన పడుతున్నది.

    రాష్ర్టం ఏర్పాటు చేసినా పదేళ్లుగా ప్రతిపక్షంలో అధికారానికి దూరంగా ఉన్న  కాంగ్రెస్ ఆ పార్టీ.. ఇప్పుడు రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవాలని ఆరాటపడుతున్నది. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటని పక్షంలో పార్టీకి మరింత నష్టం తప్పదు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో గెలుపు కాంగ్రెస్ కు అత్యవసరం. పదేళ్లుగా అధికారం లేకపోవడంతో క్యాడరంతా చేజారుతున్నది. ఇప్పటికే బీఆర్ ఎస్ లో కొంత చేరిపోయింది. రానున్న ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడ కష్టమే. జాతీయ స్థాయిలో పట్టునిలబెట్టుకోవాలన్నా ఇక్కడ అధికారంలోకి రావాల్సిందే.

    అందుకే గెలుపుగుర్రాలను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తున్నది.  తుది జాబితాను ఫైనల్ చేసేందుకు భారీగానే కసరత్తు చేస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే తొలిజాబితాను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మొదటి జాబితాలో 30-35 పేర్ల వరకు ఉండొచ్చన్న నే ఉహాగానాలు వినిపిస్తున్నాయి,

    దాదాపు నాలుగైదు విడుతల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. తొలి జాబితాలో బలమైన.. ముఖ్యమైన అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారని చెబుతున్నారు. తాజాగా ఎనిమిది గంటల పాటు భేటీ సాగడం గమనార్హం. మొత్తం 119 స్థానాల్లో టికెట్లు ఆశిస్తున్న వారి జాబితాను 300 మందికి షార్ట్ లిస్టు చేసినట్లు సమాచారం. ఇందులో ఒకే ఒక్క అభ్యర్థి బరిలో ఉన్న నియోజకవర్గాలు 30-35 వరకు ఉన్నాయని.. రెండేసి పేర్లు ఉన్న స్థానాలు 20-30 మధ్య.. ముగ్గురు చొప్పున పోటీ పడుతున్న స్థానాలు 30-35 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

    ఇక.. నలుగురికి పైనే టికెట్లు ఆశిస్తున్న స్థానాలు దాదాపు పది వరకు ఉన్నాయని.. వాటి విషయంలో చివరాఖరులో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.  ఒకే ఒక్కఅభ్యర్థి బరిలో ఉన్న జాబితాను ఇప్పటికే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదానికి పంపారు. అక్కడి నుంచి ఓకే అన్న మాట వచ్చినంతనే తొలి జాబితాను విడుదల చేస్తారని చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మొదటి జాబితాను.. వచ్చే నెల మొదటి వారంలో రెండో జబితాను., రెండో వారంలో థర్డ్ లిస్ట్ ను ప్రకటిస్తారని చెబుతున్నారు. ఏదైనా పీటముడి పడితే మాత్రం నాలుగో విడతలోనూ  అభ్యర్థుల్ని ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నాయి.

    అయితే వరుసగా మూడుసార్లు ఓడిన వారికి మాత్రం టికెట్ ఇవ్వద్దని  నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. అలాంటి నియోజకవర్గాలు దాదాపు ఆరేడు వరకు ఉన్నాయని చెబుతున్నారు. టికెట్ల ఎంపికలో సర్వే రిపోర్టులను పరిగణనలోకి తీసుకుంటారని చెబుతున్నారు. తొలి జాబితాలో వెల్లడయ్యే అభ్యర్థుల విషయానికి వస్తే.. ఇప్పటికే గుర్తింపు పొందడంతో పాటు.. బలమైన నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది.  ఆ జాబితాలో ఉన్నవారిలో వీరు ఉన్నట్లు సమాచారం.

    • రేవంత్ రెడ్డి
    • భట్టి విక్రమార్క
    • ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • కోమటిరెడ్డి
    • సీతక్క
    • పొదెం వీరయ్య
    • శ్రీధర్ బాబు
    • జగ్గారెడ్డి
    • దామోదర రాజనర్సింహ
    • జి. వినోద్
    • షబ్బీర్ అలీ
    • సంపత్ కుమార్
    • వంశీ చంద్ రెడ్డి
    • గడ్డంప్రసాద్ కుమార్
    • పొంగులేని శ్రీనివాస్ రెడ్డి
    • జూపల్లి క్రిష్ణారావు
    • తుమ్మల నాగేశ్వరరావు
    • ఫిరోజ్ ఖాన్
    • ప్రేమ్ సాగర్ రావు
    • అంజన్ కుమార్ యాదవ్
    • పద్మావతి రెడ్డి
    • మల్ రెడ్డి రంగారెడ్డి
    • విజయరమణారావు
    • అడ్లూరి లక్ష్మణ్ కుమార్
    • వంశీ క్రిష్ణ

    Share post:

    More like this
    Related

    Johnny Master case : నిజాన్ని ఎదుర్కొని పోరాడాలి.. జానీ మాస్టర్ వ్యవహారంపై మంచు మనోజ్ వ్యాఖ్యలు

    Johnny Master case : అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ పరారీలో ఉన్న...

    Minister Kollu Ravindra : ఫిష్ ఆంధ్రను ఫినిష్ చేశారు: మంత్రి కొల్లు రవీంద్ర

    Minister Kollu Ravindra : కృష్ణా జిల్లా పామర్రు కురుమద్దలిలో ఆక్వా...

    Kajrare : కజ్రారే. కజ్రారే పాటకు పెళ్లి కూతురు డ్యాన్స్.. వైరల్ అవుతున్న వీడియో

    Kajrare Song : సోషల్ మీడియాలో రోజుకో  వీడియోలు వైరల్ అవుతూనే...

    Mohan Babu : చిరంజీవి చేసిన పనికి మోహన్ బాబుకు డబుల్  హ్యాట్రిక్స్

    Mohan Babu : మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Revanth : జగన్ విషయంలో కరెక్ట్ కానిది.. రేవంత్ విషయంలో ఎలా కరెక్ట్ అయ్యింది..?

    Revanth Reddy and Chiranjeevi : రేవంత్ రెడ్డి ఎదుట చిరంజీవి...

    Revanth Reddy : చేతులు కట్టుకొని కూర్చోం.. బీఆర్ఎస్ కు రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..

    CM Revanth Reddy : గత కొన్ని రోజులుగా పాడి వర్సెస్...

    Telangana : జంపింగ్ ఎమ్మెల్యేలను రక్షించేందుకు ప్రభుత్వ పెద్దల భారీ స్కెచ్

    Telangana : ఎన్నికలు పూర్తై పది నెలలు కావొస్తుంది. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ కు రోజుకో ఎమ్మెల్యే షాకిస్తున్నారు. ఒక్కొక్కరుగా అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు.

    KTR : ఒక్క సీటు కూడా గెలవలేదని రేవంత్ రెడ్డి  హైదరాబాద్‌పై పగబట్టారు: కేటీఆర్

    KTR : హైదరాబాద్‌లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేదని, అందుకే...