Prachi Thaker సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది కామన్ అయిపోయింది. ఎవరిని అడిగిన ఇదంతా మాములే అన్నట్టు మాట్లాడు తున్నారు. అవకాశాలు కావాలంటే కొందరు కమిట్మెంట్ ఇస్తారని టాక్ ఉంది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ మీద ఈ మధ్య హీరోయిన్స్ బాగా కామెంట్ చేస్తున్నారు..
ఇంతకు ముందు ఇలాంటివి బయటకు చెప్తే ముందు ముందు అవకాశాలు రాకుండా చేస్తారేమో అని భయపడేవారు.. కానీ ఇప్పుడు అలా కాదు.. ఒక్కో హీరోయిన్ బయటకు వచ్చి ఈ కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేస్తూ ఈ విషయం నిత్యం నెట్టింట వార్తల్లో ఉండేలా చేస్తున్నారు. మరి తాజాగా మరో బ్యూటీ ఈ కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది.
ఆమె ఎవరంటే ‘రాజుగాడి కోడి పులావ్’ సినిమాతో తెలుగు లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రాచీ ఠాకర్.. ఈమె తెలుగులో పెద్దగా అవకాశాలు అయితే లేవు.. ఈ క్రమంలోనే తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కాస్టింగ్ కౌచ్ గురించి ఆమె ఫేస్ చేసిన చేదు అనుభవాల గురించి ఆమె చెప్పుకొచ్చింది.
చదువుకునే రోజుల్లోనే నాకు ఒక యాడ్ ఆఫర్ వచ్చింది. అయితే షూటింగ్ జరుగుతుంది అనగా నాకు ఫోన్ చేసి నిర్మాతకు కమిట్మెంట్ ఇవ్వాలని అనగా నాకు అర్ధం కాలేదు.. దీంతో మీరు ఒక రోజు రాత్రి గెస్ట్ హౌస్ కు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.. దాంతో నాకు భయం వేసి యాడ్ కు నో చెప్పాను.. అంటూ ఈమె చెప్పుకొచ్చింది..