Jagan’s regime : నాటి చంద్రబాబు పాలనకు.. నేటి జగన్ పాలనకు చాలా తేడా ఉంది. చంద్రబాబు రామరాజ్యం తెస్తే.. జగన్ రౌడీ రాజ్యం తెచ్చాడని ప్రజలు, ప్రతిపక్షాలే ఆరోపిస్తున్నాయి. జగన్ పాలనలో ప్రతిపక్షాలపై దాడులు.. ఎమ్మెల్యేలపై దాడులు, ప్రజల ప్రాణాలకు రక్షణే లేదు. అసెంబ్లీలోనే టీడీపీ ఎమ్మెల్యేలను కొడుతున్నారు బెదిరిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబునే జైలుకు పంపిన పరిస్థితి. పాలనలో జగన్ ఎంత పంచుతున్నా.. అంతుకుమించిన ధరా భారంతో పిండుకుంటున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. మధ్యం ధరలకు అయితే పట్టపగ్గాల్లేవని.. పక్కరాష్ట్రాలతో పోలిస్తే డబుల్ ధరలకు అమ్ముతున్నారని ఆరోపిస్తున్నారు.
నాటి చంద్రబాబు పాలనలో కందిపప్పు ధర రూ.74 ఉంటే.. జగన్ పాలనలో నేడు ఆ ధర రూ.140గా ఉంది. ఇద్దరి పాలన మధ్య ధరల తేడా ఏకంగా రూ.66 అంటే డబుల్ అయ్యింది. అదే కాదు పెసరపప్పు నుంచి నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు కూడా అంతే.. ఇక లారీ ఇసుక ధర చంద్రబాబు పాలనలో కేవలం రూ.10వేలు మాత్రమే.. ఇప్పుడు ఏకంగా రూ.50వేలు ఉంది. ఇక రవాణా ఖర్చులు అధికం.
ఈ ధరల పట్టిక చూశాక ఒక్కటే అనిపిస్తోంది. జగన్ కనుక మరోసారి వస్తే ఈ ధరలను కంట్రోల్ చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు.. ఈ రాష్ట్రాన్ని ధరాఘాతంగా నుంచి ఎవరూ కాపాడలేరు.