
producer crazy : మీ టూ ఉద్యమం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. చిత్ర పరిశ్రమలను ఈ ఉద్యమ సెగలు బాగా తాకాయి అనే చెప్పాలి.. ఒక్కసారిగా మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చిన ఆ డైరెక్టర్ ఇలా అన్నాడు అని.. ఈ హీరో అలా ప్రవర్తించాడు అని చెప్పడం పరిశ్రమలలో మిందుగు పడని విషయం.
ఆ తర్వాత ఈ ఉద్యమం సర్దుకున్న కూడా అప్పుడప్పుడు కొంతమంది నటీమణులు ఇలాంటి కామెంట్స్ చేస్తూ క్యాస్టింగ్ కౌచ్ పేరును ఎప్పుడూ వినిపించేలా చేస్తారు.. వీటిలో నిజానిజాలు తెలియదు కానీ వాటి వల్ల ఆ సెలెబ్రిటీల పేర్లు మాత్రం మారుమోగి పోతుంటాయి.. ఇదిలా ఉండగా తాజాగా ఒక నిర్మాత గురించి ఆరోపణలు చేసింది ప్రముఖ నటి..
ఇండస్ట్రీలో రాణించాలంటే కొంతమందికి పడక సుఖం ఇవ్వాల్సిందే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది.. ఈ సమస్య ఇప్పటిది కాదు అని ఎన్నో దశాబ్దాలుగా ఎంతో మంది లైంగిక వేధింపులకు గురి అయ్యారని వాపోతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి శబ్ మంగళ్ మే దంగల్ మూవీ ఫేమ్ సంగీతా ఒడ్వానీ గతంలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక సమస్యల గురించి చెప్పుకొచ్చింది.
నాకు తెలిసి ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్, ఇతర నటీమణులు ఖచ్చితంగా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొని ఉండే ఉంటారు.. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అనేది నిజం.. గతంలో నాకు ఒక ప్రొడ్యూసర్ సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని.. నన్ను తన ఇంటికి ఒంటరిగా రమ్మని అడిగాడు.. కానీ నేను నా స్నేహితులతో వెళ్లడంతో ఆ నిర్మాత తన ప్లాన్ ఫెయిల్ అయిందని తర్వాత కలుద్దాం అని వెళ్లిపోయారు.. అంటూ చెప్పుకొచ్చింది.