
Tirupati Laddu : చాలాకాలం తర్వాత తిరుపతి లడ్డు నాణ్యత చాలా మెరుగు మెరుగుపడింది. చాలా బాగుంది. మొన్నటివరకు పంచదారతో దారుణమైన క్వాలిటీతో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని రుచి లేకుండా తయారు చేశారు. ఆ విధానానికి స్వస్తి పలికి మరల లడ్డును మంచి రుచితో టీటీడీ అందిస్తోంది. అందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది టీటీడీ. అందుకు టీటీడీకి భక్తులు ధన్యవాదాలు చెప్తున్నారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది లడ్డు. తిరుపతి లడ్డుకు ఉన్న ప్రాముఖ్యత మరే లడ్డూకు లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. దీని రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు. అందుకే ఈ లడ్డూకు భౌగోళిక ఉత్పత్తి లైసెన్స్ లభించింది. ఈ లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులను పాటిస్తారు. స్వచ్ఛమైన శనగపిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండుద్రాక్ష, యాలకులు, జీడిపప్పు, కర్పూరం మొదలైన పదార్థాలు ఉపయోగిస్తారు.